Devotional

నేటి మీ రాశి ఫలితాలు

నేటి మీ రాశి ఫలితాలు

🕉️హిందూ ధర్మం🚩
🌹 శుభోదయం 🌹
✍🏻 26.07.2023 ✍🏻
🗓 నేటి రాశి ఫలాలు 🗓

🐐 మేషం
ఈరోజు (26-07-2023)

చేసిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఉత్సాహవంతమైన కాలాన్ని గడుపుతారు. ఆర్థిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. తోటి వారితో మాట పట్టింపులకు పోరాదు. ఆరోగ్యం అన్ని విధాల సహకరిస్తుంది. ఇష్టదైవాన్ని స్మరించుకోవడం వల్ల మరింత శుభం జరుగుతుంది.
🐐🐐🐐🐐🐐🐐🐐

🐂 వృషభం
ఈరోజు (26-07-2023)

మీ రంగాల్లో ధైర్యంతో వ్యవహరించి విజయాలకు దగ్గరవుతారు. ఆదాయానికి తగ్గ ఖర్చు సూచితం. ఒక ముఖ్యమైన విషయంలో ఓ శుభవార్త ను వింటారు. తోటి వారితో జాగ్రత్తగా మెలగాలి. ఆత్మవిశ్వాసం పెరగడానికి శివ ధ్యానం చేస్తే మంచి ఫలితం వస్తుంది.
🐂🐂🐂🐂🐂🐂🐂

💑 మిధునం
ఈరోజు (26-07-2023)

మీ పనులను క్రమబద్ధీకరించి అనుకున్న ఫలితాలు సాధిస్తారు. కొన్ని విషయాలు ముందు చూపుతో వ్యవహరించండి. శ్రమ అధికమవడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో గడుపుతారు. ఒక శుభవార్త మీ ఇంటి ఆనందాన్ని నింపుతుంది. దత్త కవచం చదవాలి.
💑💑💑💑💑💑💑

🦀 కర్కాటకం
ఈరోజు (26-07-2023)

తలపెట్టిన కార్యాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఎన్ని ఆటంకాలు వచ్చినా దీక్షతో పనిచేస్తే విజయం మీదే. బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగాలి. చతుర్థ స్థానంలో చంద్రుడు అనుకూలించలేదు. అస్థిర బుద్ధి వల్ల ఇబ్బందులు వస్తాయి. చంద్ర శ్లోకం చదువుకోవాలి
🦀🦀🦀🦀🦀🦀🦀

🦁 సింహం
ఈరోజు (26-07-2023)

ప్రయత్నాలు ఫలిస్తాయి. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. తృతీయ చంద్రబలం అనుకూలిస్తుంది. కీలక విషయాల్లో మనోధైర్యంతో ముందుకు వెళ్లి చక్కటి ఫలితాలు అందుకుంటారు. ఖర్చులను తగ్గించాలి. ఆంజనేయ స్వామి దర్శనం మంచిది.
🦁🦁🦁🦁🦁🦁

💃 కన్య
ఈరోజు (26-07-2023)

మీ శక్తి సామర్థ్యాలను సరిగ్గా అంచనా వేసుకుని లక్ష్యాన్ని నిర్ణయించుకుంటారు. ఏకాగ్రత లోపించకుండా జాగ్రత్తపడాలి. శత్రువులపై విజయం సాధిస్తారు. ద్వితీయ చంద్ర దోషం వల్ల శ్రమ పెరుగుతుంది. సమయానికి నిద్రాహారాలు తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. గురు ధ్యానం చేయాలి.
💃💃💃💃💃💃💃

⚖ తుల
ఈరోజు (26-07-2023)

గతంలో కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విజయ అవకాశాలు మెరుగవుతాయి. ధన, ధాన్య లాభాలు ఉన్నాయి. జన్మస్థ చంద్ర బలం అనుకూలిస్తుంది. మంచి ఆరోగ్యం కలదు. శ్రీ వెంకటేశ్వర స్వామి గోవింద నామాలు చదవాలి.
⚖⚖⚖⚖⚖⚖⚖

🦂 వృశ్చికం
ఈరోజు (26-07-2023)

మానసికంగా దృఢంగా ఉంటారు. నూతన ఆలోచనలు కార్యరూపం దాలుస్తారు. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు ఉపకరిస్తాయి. సొంత ఇంటికి సంబంధించిన విషయంలో ముందడుగు వేస్తారు. ఆదిత్య హృదయం సత్ఫలితాలను ఇస్తుంది.
🦂🦂🦂🦂🦂🦂🦂

🏹 ధనుస్సు
ఈరోజు (26-07-2023)

అదృష్ట కాలం కొనసాగుతోంది. చేపట్టే పనిలో విజయాలు సాధిస్తారు. బంధుమిత్రులతో విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారస్తులకు ఆర్థిక లావాదేవీలు సత్ఫలితాన్ని ఇస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. గణపతి ఆరాధన చేయడం మరింత శుభాన్నిస్తుంది.
🏹🏹🏹🏹🏹🏹🏹

🐊 మకరం
ఈరోజు (26-07-2023)

చేసిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పోరాడి విజయం సాధిస్తారు. తోటి వారి సహాయం అందుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఎవరినీ అతిగా నమ్మి.. మాటకాని, ధనం కానీ ఇవ్వరాదు. దశమంలో చంద్రబలం అనుకూలిస్తుంది. భోజన సౌఖ్యం కలదు. రామనామం జపించాలి.
🐊🐊🐊🐊🐊🐊🐊

🏺 కుంభం
ఈరోజు (26-07-2023)

మీ రంగాల్లో సురక్షిత మార్గాల్లో ముందుకు వెళ్లడం ద్వారా సత్ఫలితాలు వస్తాయి. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. ధన సంపద విషయాల్లో జాగ్రత్త అవసరం. మాట విలువను కాపాడుకోవాలి. తొమ్మిదవ రాశిలో చంద్ర సంచారం విజ్ఞానాన్ని సూచిస్తుంది. సాయిబాబా నామాన్ని జపించాలి.
🏺🏺🏺🏺🏺🏺🏺

🦈 మీనం
ఈరోజు (26-07-2023)

ఆశయ సాధనలో ఓర్పు, ఓపిక రెండూ చాలా అవసరం. ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి. పూర్వఫలం రక్షిస్తుంది. తోటి వారితో ఆచితూచి వ్యవహరించాలి. శివారాధన శ్రేయస్కరం.
🦈🦈🦈🦈🦈🦈🦈