మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలో ఓ తండ్రి.. ప్రేమించిన యువకుడితో తన కుమార్తె పెళ్లిని శ్మశానంలో ఘనంగా చేశాడు. సంప్రదాయబద్ధంగా అక్కడే వివాహ తంతు పూర్తయింది. శిర్డీ సమీపంలోని రహతా గ్రామానికి చెందిన గంగాధర్ స్థానిక శ్మశానవాటికలో కాటికాపరిగా పనిచేస్తున్నాడు. మహాసంజోగి వర్గానికి చెందిన ఈయన.. చాలా ఏళ్లుగా కుటుంబంతో కలిసి శ్మశానంలోనే నివాసం ఉంటున్నాడు. గంగాధర్ కుమార్తె మయూరి అక్కడే ఉంటూ.. 12వ తరగతి వరకు చదివింది. శిర్డీకి చెందిన మనోజ్ అనే యువకుణ్ని ఆమె ప్రేమించింది. ఈ పెళ్లికి ఇరువురి కుటుంబాలు అంగీకరించగా.. మయూరి పెరిగినచోటే ఆమె పెళ్లి చేయాలన్న గంగాధర్ సంకల్పం కూడా బంధుమిత్రుల సాక్షిగా దిగ్విజయంగా పూర్తయింది.
Shirdi: శ్మశానంలో పెళ్లి
Related tags :