WorldWonders

నీటిలో పాత్రలను కనిపెట్టగల ‘స్వతంత్ర జలాంతర్గత వాహనం

నీటిలో పాత్రలను  కనిపెట్టగల ‘స్వతంత్ర జలాంతర్గత వాహనం

నీటిలో సంచరిస్తూ మందుపాతరల జాడ కనిపెట్టగల ‘స్వతంత్ర జలాంతర్గత వాహనం (ఏయూవీ)’ను(Autonomous Underwater Vehicle) (AUV) పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో శుక్రవారం ఆవిష్కరించారు. ‘నీరాక్షి’గా పిలుస్తున్న ఈ ఏయూవీని కోల్‌కతాలోని గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ అండ్‌ ఇంజినీర్స్‌ (జీఆర్‌ఎస్‌ఈ) లిమిటెడ్‌(GRSE), ఏఈపీఎల్‌(AEPL) అనే మరో కంపెనీలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. మన దేశంలో ఈ తరహా జలాంతర్గత వాహనం ఇదే మొదటిది. నీరాక్షి స్థూపాకారంలో ఉంటుంది. దాని పొడవు 2.1 మీటర్లు. వ్యాసం దాదాపు ఒక అడుగు. బరువు 45 కిలోలు. మరో 6-12 నెలల్లో వాణిజ్య వినియోగానికి అనుగుణంగా దాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆలోగా భారత నౌకాదళం, సైన్యం ఈ ఏయూవీని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తాయి. ప్రస్తుతానికి మందుపాతరలను గుర్తించే సామర్థ్యమే ఉన్నప్పటికీ.. వాటిని నిర్వీర్యం చేయడంతో పాటు జలాంతర్గత సర్వేలు చేపట్టేందుకు వీలుగా భవిష్యత్తులో దాన్ని తీర్చిదిద్దనున్నారు.