శనివారం తెల్లవారుజామున తమిళనాడులోని మధురై రైల్వే స్టేషన్ లో యాత్రికుల రైలులో మంటలు చెలరేగి పదుల సంఖ్యలో మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. యాత్రికులకోచ్ లో జరిగిన ఈ ప్రమాదం మీద విచారణ జరుగుతుంది. దీనిపై ఆదివారం నాడు ఫోరెన్సిక్ నిపుణులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఓ పెట్టెలో సగం కాలిన నోట్లు భారీగా బయటపడ్డాయి.అందులో మొత్తం రూ. 500, రూ 200 నోట్లు ఉన్నట్లు ఫోరెన్సిక్ నిపుణులు గుర్తించారు. ఈ మొత్తాన్ని ట్రావెల్ ఏజెన్సీ వారు యాత్రికుల కోసం మధ్యలో ఖర్చు పెట్టడం కోసం తెచ్చుకున్నట్లుగా అనుమానిస్తున్నారు. తమిళనాడుకు లక్నో నుంచి వచ్చే ఓ రైలులో మొత్తం 63మంది ప్రయాణికులు స్పెషల్ కోచ్ లో వస్తున్నారు.
ఈ ఘటన జరిగిన తర్వాత కోచ్ లో ఇద్దరు వ్యక్తులు మాయమైనట్లుగా తెలుస్తోంది. దీంతో అనుమానించిన పోలీసులు ఆదివారం ప్రత్యేక బలగాలతో వీరి కోసం తనిఖీలు చేపట్టారు. వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. జరిగిన అగ్ని ప్రమాదానికి వీరికి ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో అధికారులు విచారణ చేస్తున్నారు. ఘటనాస్థలిలో దక్షిణ సర్కిల్ కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ ఏఎం విచారణ చేపట్టారు.ఇదిలా ఉండగా, శనివారం ఉదయం మధురై రైల్వే స్టేషన్ కి ఒక కిలో మీటర్ దూరంలో ఉండగా.. ఓ ఐఆర్సీటీ స్పెషల్ ట్రైన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. లక్నో-రామేశ్వరం టూరిస్ట్ రైలులో అగ్ని ప్రమాదంలో తొమ్మిదిమంది మృతి చెందారు. సిలిండర్ పేలడంతో మంటలు చెలరేగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.
రైలులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు తమవెంట తెచ్చుకున్న సిలిండర్ మీద టీ పెట్టడానికి ప్రయత్నించడంతో ఒక్కసారిగా సిలిండర్ పేలింది. రైలు కదులుతుండడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందారు. ఐఆర్టీసీ స్పెషల్ ట్రైన్ లో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ఐఆర్టీసీ స్పెషల్ ట్రైన్ లో వెళ్లే ప్రయాణికులు పర్యాటక స్థలంలో వంటలు చేసుకోవడం కోసం తమ వెంట చిన్న సిలిండర్లు తీసుకువెడుతుంటారు. అలా తీసుకువెడుతుండగానే ఈ ప్రమాదం జరిగింది. పర్యాటక రైలు కావడంతో అంతగా పట్టించుకోలేదని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.