పోలవరంపై కేంద్ర ప్రభత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోలవరం నిర్మాణంలో తలెత్తిన లోపాల దిద్దుబాటుపై నేటి నుంచి అధ్యయనం చేయాలని కేంద్ర జల్ శక్తిశాఖ నిర్ణయించింది. ఈ బాధ్యతలను ఆ శాఖ సలహాదారు శ్రీరామ్ కు అప్పగించింది. ఇప్పటివరకు తలెత్తిన లోపాలు పునరావృతం కాకుండా చేయాలంటే ఏం చేయాలి? ఎలాంటి నిర్వహణ ప్రమాణాలు అనుసరించాలన్న దానిపై అధ్యయనం చేయనున్నారు.పోలవరం ప్రాజెక్టు అథారిటీ, CWC, జల్ శక్తిశాఖ అధికారులతో సమావేశమై త్వరలోనే ఒక నిర్ణయానికి రానున్నారు. కాగా, ఈనెల 31న వైయస్సార్ రైతు భరోసా నిధులను సీఎం జగన్ అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. వరుసగా ఏడో ఏడాది కౌలు రైతులతో పాటు దేవాదాయ భూములు సాగుచేసే వారికి రైతు భరోసా నిధులను అందించనున్నారు. సిసిఆర్సిలు పొందిన వారిలో అర్హులైన 1,42,693 మంది కౌలుదారులతో పాటు 3,631 మంది దేవాదాయ భూముల సాగుదారుల ఖాతాల్లో తొలి విడతగా రూ.7500 చొప్పున రూ.109.74 కోట్లను జమ చేయనున్నారు.