ఎల్బీనగర్‌కు చెందిన ఓ వివాహిత అనారోగ్యంతో అమెరికాలో ఆత్మహత్యకు పాల్పడింది. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండల పరిధిలోని అమ్మనబోలు(వెంకటాపురం)కు చెందిన ఏనుగు మల్లారెడ్డి, అనసూర్య దంపతులు ఎల్బీనగర్ కామినేని వెనుక ఉన్న సూర్యోదయ కాలనీలో నివాసమంటున్నారు. వీరి కుమారుడు ఏనుగు శ్రీనివాస్‌రెడ్డికి కవిత(40)తో 18ఏళ్ల క్రితం వివాహమైంది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌రెడ్డి అమెరికాలోని మిస్సోరిలో స్థిరపడ్డారు. అనారోగ్య సమస్యలతో ఆమె గురువారం మధ్యాహ్నం ఉరి వేసుకుని బలవర్మరణానికి పాల్పడింది