టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేసిన నేపధ్యంలో APSRTC అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. చంద్రబాబును అరెస్ట్ చేయడం పై పుట్టపర్తిలో ఆర్ టి సి బస్సులను ముందస్తుగా డిపోకి తరలించారు ఆర్‌టిసి అధికారులు. దీంతో పుట్టపర్తిలో ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణమంతా ఖాళీగా దర్శనిమిస్తో్ంది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.