NRI-NRT

చంద్రబాబు అరెస్ట్‌పై డీసీలో NRITDP నిరసన

చంద్రబాబు అరెస్ట్‌పై డీసీలో NRITDP నిరసన

14సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి, జాతీయ నేతగా గుర్తింపు పొంది, ప్రస్తుతం రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా విధులు నిర్వహిస్తున్న నారా చంద్రబాబు నాయుడుని అక్రమంగా., అప్రజాస్వామికంగా రాష్ట్ర గవర్నర్ కు కూడా కనీస సమాచారం కూడా లేకుండా అరెస్ట్ చేయటం రాష్ట్ర రాజకీయ చరిత్రలో చీకటి రోజని డీసీ NRITDP శ్రేణులు పేర్కొన్నాయి. సతీష్ వేమన ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. పార్లమెంట్ సభ్యులు రఘురామకృష్ణంరాజు ఈ నిరసనలో పాల్గొన్నారు. యాష్ బొద్దులూరి, భాను మాగులూరి, సాయి బొల్లినేని,రమేష్ గుత్తా, నెల్లూరి నాగేశ్వర్రావు, సమంత్, ప్రదీప్ గుత్తా, హను వెంపరాల, యండమూరి నాగేశ్వర్ రావు, పచ్చిక అశోక్ రెడ్డి, మారం నారాయణ రెడ్డి, కృష్ణయ్య, వట్టికూటి రవీంద్ర, పెద్ది సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.