NRI-NRT

జనసంద్రమైన ఫ్రిస్కో. చంద్రబాబు అరెస్టుకు నిరసన.

NRIs Protest for Chandrababu in Frisco Texas USA

టెక్సాస్ రాష్ట్ర ఫ్రిస్కో నగరంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ చేపట్టిన కార్యక్రమం జనసంద్రమైంది. “బాబుతో నేను” ప్లకార్డులు చేతబూని భారీసంఖ్యలో హాజరయిన ప్రవాసులు స్థానిక జిమ్మీ క్లారా జోన్స్ పార్కులో భారీ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు అరెస్టు అక్రమమని మండిపడ్డారు. జగన్ సర్కార్ తక్షణమే ఆయన్ను విడుదల చేయాలని కోరారు.