కెనడా తెలుగు ఎన్నారైలు కెనడాలోని టొరంటో డౌన్ టౌన్ లోని నాథన్ ఫిలిప్స్ స్క్వేర్ వద్ద చంద్రబాబునాయుడుకి సంఘీభావం తెలిపారు. ఆయన్ను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. నాథన్ ఫిలిప్స్ స్క్వేర్ నుంచి భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయం 365 బ్లోర్ స్ట్రీట్ వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించి బాబుకు న్యాయం జరగాలని నినాదాలు చేశారు. హాజరైనవారు మెమోరాండంపై సంతకం చేసి కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా టొరంటోకు సమర్పించారు. మీనా ముల్పూరి, అనిత బెజవాడ, సతీష్ పాతూరి, సతీష్ రావిపాటి, సుంకర సుమంత్, ధనలక్ష్మీ పోతుగుంట, సందీప్ అమరనేని, సాయిప్రుధ్వి వీరపనేని, రాకేష్ సూరపనేని, విష్ణు పొట్లూరి, శశి వెన్నమనేని, శ్రీనివాస్ చిరుమామిళ్ల తదితరులు పాల్గొన్నారు.