Videos

💥 “తేజస్” టీజర్ – [Video] 💥

“తేజస్” టీజర్ – [Video]

కంగనా రనౌత్ వ‌రుస ప‌రాజ‌యాలతో ఇటీవల తీవ్ర నిరాశ‌లో కూరుకుపోయిన సంగ‌తి తెలిసిందే. ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న త‌లైవి,చంద్రముఖి-2 చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్టర్లయ్యాయి. దీంతో ఈ భామ‌ తదుపరి చిత్రం “తేజస్” పైనే హోప్స్ పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. తేజ‌స్ టీజర్‌ను ఇవాళ రిలీజ్ చేసింది. ఈ మూవీలో కంగన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్ తేజస్ గిల్‌గా నటించారు. ఈ టీజ‌ర్లో కంగ‌న వైమానిక ద‌ళ కమాండ‌ర్గా కనిపించింది. సర్వేశ్ మెవరా డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ దేశభక్తి కాన్సెప్ట్ తో వస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. దసరా బరిలో అక్టోబర్ 27న తేజస్ రావడానికి సిద్ధం అంటూ మేకర్స్ తెలిపారు.