సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్ వ్యవయసాయ క్షేత్రంలో బుధవారం నుంచి మూడు రోజుల పాటు రాజశ్యామల యాగం నిర్వహిస్తున్నారు. విశాఖపట్నం శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి పర్యవేక్షణలో యాగానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలకు చెందిన పలువురు పీఠాధిపతులు పాల్గొంటారు. 200 మంది వైదికులు మంగళవారం సాయంత్రానికి ఎర్రవల్లి గ్రామానికి చేరుకున్నారు. మొదటిరోజు తెల్లవారుజామున సంకల్పంతో శ్రీకారం చుడతారు. రెండోరోజు వేదపారాయణలు, హోమం తదితర క్రతువులు నిర్వహించారు. చివరిరోజు పూర్ణాహుతి ఉంటుంది. సీఎం కేసీఆర్ సతీమణితో కలిసి మంగళవారం రాత్రి ఎర్రవల్లికి చేరుకున్నారు.
👉 – Please join our whatsapp channel here –