DailyDose

ఎర్రగా మారిన సముద్రం నీరు

ఎర్రగా మారిన సముద్రం నీరు

పుదుచ్చేరి వద్ద సముద్రం నీరు ఎర్రని రంగులోకి మారింది. ఈ ఘటన స్థానికులు, పర్యాటకులకు ఆందోళన కలిగిస్తోంది. గత నాలుగైదు రోజులుగా సముద్రపు నీటిలో రంగుమార్పుతో ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు. ఎందుకిలా జరుగుతోందో అర్థంకాక టెన్షన్ పడుతున్నారు. ఈ మార్పులపై కొందరు ఇప్పటికే అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు రంగు మారిన సముద్రపు నీటి శాంపిల్స్‌ను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. ఇటీవల విశాఖపట్నం బీచ్‌ వద్ద కూడా సముద్రపు నీరు నల్లగా మారడంతో కలకలం రేగింది. తమిళనాడులోని పలు బీచ్‌ల్లోనూ సముద్రపు నీటి రంగు మారడం చర్చనీయాంశంగా మారింది. ఇక సూర్యోదయం, సూర్యాస్తమయం రెండూ చూడగలిగే అరుదైన అవకాశం ఉన్న కన్యాకుమారిలో కూడా సముద్రంలో నీరు అసాధారణంగా కనబడింది. తాజాగా పుదుచ్చేరి సముద్ర తీరంలో నీరు రంగు ఎర్రగా మారింది.

నీటిలో ఆల్గే వంటి సూక్ష్మజీవులు ఉన్నా లేదా ఇతర పదార్థాలు ఉన్నా రంగు మారే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. వాతావరణ మార్పుల కారణంగా కూడా సముద్రపు నీటి రంగు మారే అవకాశం ఉన్నట్టు ఇటీవల జరిగిన ఓ అధ్యయనంలో తేలింది. పుదుచ్చేరి బీచ్ అందాలను ఆస్వాదించడానికి ప్రతిరోజూ అనేక మంది పర్యాటకులు పుదుచ్చేరి కి వస్తుంటారు. చెన్నై మెరీనా బీచ్ తర్వాత పుదుచ్చేరి బీచ్ అత్యంత ప్రసిద్ధ చెందిన పర్యాటక ప్రదేశం. చెన్నై తో పాటు రెండు తెలుగు రాష్ట్రాలనుంచి పర్యాటకులు వేల సంఖ్య లో వస్తుంటారు .ఈ నేపథ్యంలో పుదుచ్చేరి సముద్ర తీర ప్రాతం లో చోటుచేసుకుంటున్న పెను మార్పులు పర్యాటకులను ఆందోళనకి గురిచేస్తుంది . గత నాలుగైదు రోజులుగా బీచ్ ప్రాతం లో సముద్రం లో నీటి రంగు పూర్తిగా ఎరుపు రంగులోకి మారిపోతుంది. సముద్రం రంగు మార్పుపై స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. బీచ్ పరిసర ప్రాంతాలలో సమీక్షించి నీటి శాంపిల్స్ ని ల్యాబ్ కి పంపించారు అధికారులు . ఈ క్రమంలో సముద్రపు నీరు రంగు మారడంపై రకరకాల ఊహాగానాలు రావడంతో పుదుచ్చేరి బీచ్ ప్రాంతాల్లోకి వెళ్ళడానికి భయపడుతున్నారు స్థానికులు, అటు పర్యాటకులు. ఈ పరిస్థితులపై క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z