Videos

‘ఈగల్’ టీజర్

‘ఈగల్’ టీజర్

మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) ఈ దసరాకి ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాతో ఆడియన్స్ ని పలకరించాడు. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పరవాలేదు అనిపించింది. ప్రస్తుతం రవితేజ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో చేస్తున్న ‘ఈగల్’ సినిమా సంక్రాతికి రిలీజ్ కానుంది.

ఇప్పటికే ఈగల్ షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్టు సమాచారం. గతంలో ఈ సినిమా అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన ఒక వీడియో ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. ఆ వీడియో చూసిన తరువాత.. సినిమా సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతుందని అర్థమైంది. తాజాగా ఈగల్ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.

టీజర్ లో రవితేజ గురించి గొప్పగా, ఒక కథలా చెప్పారు. ఇందులో రవితేజ లుంగీ కట్టి, తుపాకీ పట్టి మరింత మాస్ గా కనిపించాడు. ఇక ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మధుబాల, నవదీప్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈగల్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z