ప్రముఖ నిర్మాత దిల్‌రాజు (Dil Raju) ఓటీటీ రంగంలోకి అడుగుపెడుతున్నారంటూ కొద్ది రోజులుగా సామాజిక మాధ్యమాల వేదిక వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. చిన్న సినిమాలను ప్రోత్సహించేందుకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను తీసుకురానున్నట్లు ప్రచారం జరిగింది. ఈ వార్తలను దిల్ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఖండించింది. నిర్ధారణ కాకుండా వార్తలను ప్రచురించవద్దని కోరింది. ఈ మేరకు ట్వీట్ చేసింది.
‘‘మా నిర్మాత దిల్‌రాజు ఓటీటీ ఫ్లాట్‌ఫాంను తీసుకొస్తున్నారనే వార్తలు పూర్తిగా నిరాధారమైనవి. నిర్ధారణ కాని వార్తలను దయ చేసి ఎవరూ ప్రచురించవద్దు’’ అని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఎక్స్ (ట్విటర్)లో పేర్కొంది. రూ.5కోట్లలోగా బడ్జెట్‌తో దాదాపు 25 చిన్న సినిమాలను నిర్మించి వాటిని ఓటీటీ వేదికగా విడుదల చేయాలని యోచిస్తున్నట్టు టాక్ వినిపించింది. ఇది 2024లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని, ఒకవేళ ఇదే నిజమైతే ఆయన నిర్మించే సినిమాలతో పాటు.. డిస్ట్రిబ్యూట్ చేసే చిత్రాలు కూడా అందులోనే విడుదలయ్యే అవకాశముందని కథనాలు వచ్చాయి.
👉 – Please join our whatsapp channel here –