Politics

జగన్‌కు హైకోర్టు నోటీసులు

జగన్‌కు హైకోర్టు నోటీసులు

ఏపీ సీఎం జగన్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీచేసింది. జగన్‌ అక్రమాస్తుల కేసులో మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య దాఖలు చేసిన పిల్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. పిల్‌గా పరిగణించేందుకు రిజిస్ట్రీ పేర్కొన్న అభ్యంతరాలపై సీజే జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ ఎన్‌.వి.శ్రావణ్‌కుమార్ ధర్మాసనం విచారణ జరిపింది. హరిరామ జోగయ్య దాఖలు చేసిన సవరణలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించేందుకు అంగీకారం తెలిపింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది పోలిశెట్టి రాధాకృష్ణ వాదనతో ఏకీభవించిన ఉన్నత న్యాయస్థానం.. పిల్‌కు నంబర్‌ కేటాయించాలని రిజిస్ట్రీని ఆదేశించింది.జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ కోర్టులో కేసుల విచారణ వేగంగా పూర్తయ్యేలా ఆదేశించాలంటూ హరిరామజోగయ్య పిల్‌ దాఖలు చేశారు. 2024లో జరిగే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లోపు కేసులను తేల్చేలా ఆదేశాలివ్వాలని ఆయన పేర్కొన్నారు. అనంతరం ప్రతివాదులు జగన్‌, సీబీఐ, సీబీఐ కోర్టుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z