Politics

అంబులెన్స్‌లో వెళ్లి నామినేషన్ వేయనున్న ప్రభాకర్ రెడ్డి

అంబులెన్స్‌లో వెళ్లి నామినేషన్ వేయనున్న ప్రభాకర్ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం కొనసాగుతోంది. నామినేషన్లకు రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. దీంతో ఆయా పార్టీల నుంచి టికెట్ కన్ఫామ్ అయిన నేతలు నామినేషన్స్ వేస్తున్నారు. ఈ నెల 10న చివరి తేది. దీంతో ఆయా పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్ధులు నామినేసన్స్ వేస్తున్నారు. ఇక రీసెంట్‌గా కత్తి దాడికి గురైన దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తోన్న కొత్త ప్రభాకర్ రెడ్డి.. అంబులెన్స్‌లో వెళ్లి నామినేషన్ వేయనున్నారు. అసలు నామినేషన్ కోసం అభ్యర్ధి లేకపోయినా.. ఆయన సంతకం ఉంటే.. ఆయన తరుపున ఎవరైన నామినేషన్ పత్రాలు సమర్పించవచ్చు. కానీ ఎన్నికల్లో లబ్ది కోసమే కొత్త ప్రభాకర్ రెడ్డి అంబులెన్స్‌లో వెళ్లి నామినేషన్ వేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏది ఏమైనా దుబ్బాకా నుంచి పోటీ చేస్తోన్న కొత్త ప్రభాకర్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులతో పాటు సామాన్య ప్రజలు కూడా కోరుకుంటున్నారు.

బీఆర్ఎస్ మెదక్ (Medak) ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి (Kotha Prabhakar Reddy)పై గత నెల 30న హత్యా యత్నం జరిగింది. ఎన్నికల ప్రచారం చేస్తున్న ప్రభాకర్ రెడ్డిపై దుండగుడు కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో కొత్త ప్రభాకర్ రెడ్డి కడుపులో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయన వ్యక్తిగత సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. గత ఎన్నికల్లో మెదక్ నుంచి ఎంపీగా గెలిచిన కొత్త ప్రభాకర్ రెడ్డి.. ప్రస్తుతం దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఇప్పటికే బీఫామ్ అందుకున్న ఆయన.. ఎన్నికల ప్రచారంలో ఈ ఘటన చోటు చేసుకుంది.కార్యకర్త ముసుగులో ఓ వ్యక్తి ప్రభాకర్ రెడ్డికి అతి సమీపంలోకి వచ్చి కరచాలనం చేస్తున్నట్లుగా నటించాడు. వెంటనే జేబులో నుంచి కత్తి తీసి.. ఎంపీ కడుపులో పొడిచాడు. దాడి చేసిన వ్యక్తిని బీఆర్ఎస్ కార్యకర్తలు పట్టుకొని చితకబాదారు. ఘటన జరిగిన వెంటనే కొత్త ప్రభాకర్ రెడ్డిని.. గజ్వేల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం.. సికింద్రాబాద్‌లోని యశోదా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయనకు వైద్యులు మెరుగైన చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. నిందితుడిని దుబ్బాక నియోజకవర్గం చెప్యాలకు గ్రామానికి చెందిన రాజుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z