NRI-NRT

బాటా ఆధ్వర్యంలో బే ఏరియాలో దీపావళి వేడుకలు

బాటా ఆధ్వర్యంలో బే ఏరియాలో దీపావళి వేడుకలు

కాలిఫోర్నియాలోని మిల్పిటాస్‌లో బే ఏరియా తెలుగు అసోసియేషన్ (BATA) ఆధ్వర్యంలో దీపావళి సంబరాలను ఘనంగా నిర్వహించారు. BATA ‘ఫ్లాగ్‌షిప్’ ఈవెంట్‌లలో ఒకటైన దీపావళి సంబరాలు బే ఏరియా తెలుగు కమ్యూనిటీలో బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ కార్యక్రమానికి స్థానిక సంఘాల నుంచి అపూర్వమైన మద్దతు లభించింది. టాలీవుడ్ గాయకులు మంగ్లీ, ఇంద్రావతి చౌహాన్‌ల లైవ్ కాన్సార్ట్‌ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఈ కార్యక్రమానికి సంజయ్ ట్యాక్స్ ప్రో అసోసియేట్, రియల్టర్‌ నాగరాజు స్పాన్సర్లుగా వ్యవహరించారు. గ్రాండ్ స్పాన్సర్‌గా ఏవీఆర్ చౌదరి (G&C గ్లోబల్), గోల్డ్ స్పాన్సర్‌గా శ్రీని గోలి రియల్ ఎస్టేట్స్, సిల్వర్ స్పాన్సర్‌లుగా PNG జ్యువెలర్స్, TESQA.AI & VYZN రియల్టీ వ్యవహరించాయి. ఈ కార్యక్రమానికి ‘పాఠశాల’, విరిజల్లు రేడియో సహకారాన్నందించాయి.

ఫుడ్ స్పాన్సర్‌గా వ్యవహరించిన ‘శ్రీ కిచెన్’ ఆహూతులకు పసందైన వంటకాలను అందించింది. ఇక, ఈ ఈవెంట్‌లో నగలు, దుస్తులు, రియల్ ఎస్టేట్, విద్య, ఆరోగ్య సంరక్షణ విక్రేతల బూత్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దాదాపు 150 మందికి పైగా పిల్లలు, యువతీయువకులు నృత్యాలతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వాలంటీర్లకు బాటా అధ్యక్షుడు కొండల్ కొమరగిరి ధన్యవాదాలు తెలిపారు. శివ కాడా, వరుణ్ ముక్క, హరి సన్నిధిలతో కూడిన BATA ఎగ్జిక్యూటివ్ కమిటీని ఆయన పరిచయం చేశారు. రవి తిరువీధుల, కామేష్ మల్ల, శిరీష బత్తుల, యశ్వంత్ కుదరవల్లి, సుమంత్ పుసులూరితో కూడిన ‘స్టీరింగ్ కమిటీ’ని కూడా పరిచయం చేశారు. ‘సాంస్కృతిక కమిటీ’ లో శ్రీదేవి పసుపులేటి, శ్రీలు వెలిగేటి, తారక దీప్తి ఉన్నారు. ‘లాజిస్టిక్స్ కమిటీ’లో సందీప్ కేదారిశెట్టి, సురేష్ శివపురం, రవి పోచిరాజు ఉన్నారు. యూత్ కమిటీలో సంకేత్, ఉదయ్, ఆది, గౌతమి, సందీప్, హరీష్ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన బాటా బృందానికి, వినోదభరితమైన సాయంత్రాన్ని అందించిన బ్యాండ్ సభ్యులకు BATA ‘సలహా బోర్డు’ సభ్యులు జయరామ్ కోమటి, విజయ ఆసూరి, వీరు వుప్పల, ప్రసాద్ మంగిన, కరుణ్ వెలిగేటి, రమేష్ కొండా, కళ్యాణ్ కట్టమూరి, హరినాథ్ చీకోటి శుభాకాంక్షలు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z