పురందేశ్వరిపై విజయసాయి ఫైర్ అయ్యారు..బావగారి కళ్ళల్లో ఆనందం కోసమే పురందేశ్వరి ఇలా చేస్థుందని మండిపడ్డారు.చంద్రబాబు గారు A-3గా కేసు నమోదైన లిక్కర్ స్కామ్ పై తన దగ్గర ఉన్నాయంటున్న ఆధారాలను పురంధేశ్వరి గారు దర్యాప్తు సంస్థ సీఐడీకి అందజేయాలని కోరారు. ప్రజల దృష్టిని మళ్లించడానికి తప్పుడు సమాచారంతో మాపైన నిందలు వేయడం కాదన్నారు.వాస్తవాలు బయట పడాలంటే సాక్షిగా తన వాంగ్మూలం ఇచ్చి నిందితులకు శిక్ష పడేలా చేయాలని డిమాండ్ చేశారు. పురందేశ్వరి గారు ఏం చదువుకున్నారో గాని, ప్రజల తెలివితేటలపై ఆమెకు చాలా చులకన భావం ఉందని వెల్లడించారు. అందుకే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మద్యం మృతులు 50 లక్షల మంది అంటూ దిగ్భ్రాంతి కలిగించే అబద్ధాన్ని అవలీలగా వదిలారని మండిపడ్డారు. కంటి శుక్లం ఆపరేషన్ చేయించుకుని కుడి కంటికి కట్టుకట్టుకున్న బావ గారి ఎడమ కంటిలో ఆనందం చూడటం కోసమే ఆమె ఇలాంటి అసత్యాలు వల్లిస్తున్నారని చురకలు అంటించారు విజయసాయి.
👉 – Please join our whatsapp channel here –