బీట్ రూట్ తొక్కలు, కమలా తొక్కలను నీడలో ఆరబెట్టాలి. పెళపెళ విరిగేలా తొక్కలు ఎండిన తరువాత మెత్తగా పొడిచేయాలి. రెండు టేబుల్ స్పూన్ల ఈ పొడిలో రోజ్‌వాటర్ వేసి పేస్టులా కలపాలి. ఈ పేస్టుని ముఖానికి రాసి ఐదు నిమిషాల పాటు మర్దన చేయాలి. తరువాత పదిహేను నిమిషాలు ఆరనిచ్చి చల్లటి నీటితో కడిగేయాలి. వారానికి రెండు మూడుసార్లు ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల ముఖం కాంతిమంతంగా మెరుస్తుంది. ఈ ప్యాక్‌తో వచ్చే గ్లో ఎక్కువ రోజులు ముఖాన్ని అందంగా ఉంచుతుంది.
చర్మాన్ని హైడ్రేట్ చేయడంలో బీట్‌రూట్ ముందుంటుంది. మొటిమలని తగ్గిస్తుంది. మురికిని దూరం చేసి చర్మాన్ని కాంతివంతంగా తయారు చేస్తుంది. ఇందులో పాలు కలిపి చేస్తాం. కాబట్టి, చర్మం మృదువుగా, మెరుస్తుంటుంది.
పాలు, తేనె రెండింటి కలయిక ముఖ సహజ కాంతిని పెంచుతుంది. పాలలో ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్ ఉంటుంది. ఇది చాలా ఎఫెక్టివ్ ఎక్స్‌ఫోలియేటింగ్ లక్షణాలని కలిగి చర్మంలోని మృతకణాలు, మలినాలను తొలగిస్తుంది. పాలలోని ఎమోలియెంట్, హైడ్రేటింగ్ గుణాలు చర్మాన్ని మృదువుగా చేస్తాయి. తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలు, మచ్చల్ని దూరం చేస్తుంది.
పండిన బొప్పాయి, పుచ్చకాయ, బంగాళాదుంప, టొమాటో, కీర దోసకాయలు ఇలా వేటినైనా పేస్ట్‌గా చేసి.. దానిని 15 నిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచండి. అనంతరం పేస్ట్‌ను అప్లై చేసి.. పేస్ట్ చర్మంలో కలిసిపోయే వరకు స్క్రబ్ చేయండి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే.. టాన్ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది.
👉 – Please join our whatsapp channel here –