Politics

వాట్సప్ కాల్ పై ఆసక్తి కనబరుస్తున్న రాజకీయ నాయకులు

వాట్సప్ కాల్ పై ఆసక్తి కనబరుస్తున్న రాజకీయ నాయకులు

ఎన్నికల నేపథ్యంలో ప్రతి విషయంపై జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ఏ మాత్రం తొందర పడిన ఇబ్బందులు తప్పని పరిస్థితులు. ఎవరితోనైనా సరే కోపంగా ఉన్నా.. స్నేహంగా ఉన్నా ముందు చూపుతో మెలిగితేనే ఫలితం కనిపిస్తుంది. ప్రస్తుత కాలంలో సాంకేతిక పరిజ్ఞానంతో ఏ హాట్‌ టాపిక్‌లు కామెంట్‌ చేసిన క్షణాల్లో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యే ప్రమాదం ఉంది. మామూలుగా ఫోన్‌కాల్‌లో మాట్లాడుతూ పొరపాటునా నోరు జారితే రికార్డు చేసి ట్రోల్‌ చేసేందుకు చరవాణి అనే ఆయుధాన్ని చేతిలో పట్టుకొని నిమిషాల వ్యవధిలోనే చక్కర్లు కొట్టించేందుకు సిద్ధంగా ఉంటారు. అందుకేనేమో బేరసారాలు మాట్లాడేందుకు సాధారణ కాల్‌ చేసేందుకు జంకుతున్నారు. ఎక్కడా రికార్డు చేసి మా రికార్డును చెడగొడుతారేమోననే భయం వారిని వెంటాడుతున్నట్లుగా కనిపిస్తుంది. ఈ మధ్యన పార్టీ అభ్యర్థులు, ముఖ్య నాయకులు వాట్సప్‌లోని వాయిస్‌ కాల్‌తో అధికంగా మాట్లాడుతున్నారని తెలుస్తుంది. అలా మాట్లాడితే కాల్‌ రికార్డు చేసే అవకాశం ఉండదనే ఆలోచనతో ఆ విధంగా మాట్లాడేందుకు మొగ్గు చూపుతున్నారు.

👉 – Please join our whatsapp channel here –https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z