NRI-NRT

ఘనంగా టాంటెక్స్ దీపావళి వేడుక

ఘనంగా టాంటెక్స్ దీపావళి వేడుక

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్) 2023 దీపావళి వేడుకలు 5వ తేదీన మార్‌తోమా చర్చిలో ఘనంగా నిర్వహించారు. సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు శరత్‌రెడ్డి యర్రం, మేనేజ్‌మెంట్‌ బోర్డు అధ్యక్షుడు అనంత్‌ మల్లవరపులు పేర్కొన్నారు.

వేడుకల్లో భాగంగా స్థానిక పాఠశాలలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించాయి. ఎస్పీ చరణ్, ఎస్పీ శైలజ, శ్రీష, సాయి విఘ్నేష్ సంగీత బృందం Simply SPB పేరిట ప్రదర్శించిన గానలహరి అలరించింది. కార్యవర్గ సభ్యులు గాయనీ గాయకులను పూలమాలలు, జ్ఞాపికలు, శాలువాలతో సత్కరించారు. 1986లో ప్రారంభమైన టాంటెక్స్, ఏడాది పొడవునా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఏకైక సంస్థ అని శరత్‌రెడ్డి అన్నారు. 2023 సంవత్సరానికి సహకారం అందించిన దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z