Business

12499 టికెట్‌ ధరతో శిర్డీ విమాన యాత్ర

12499 టికెట్‌ ధరతో శిర్డీ విమాన యాత్ర

తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (టీఎస్‌టీడీసీ) విమాన పర్యాటకాన్ని అందుబాటులోకి తెచ్చింది. రూ.12,499 టికెట్‌ ధరతో శిర్డీ యాత్రను ప్రారంభించింది. ప్రతిరోజూ హైదరాబాద్‌ నుంచి బయలుదేరే ఏసీ బస్సులకు అదనంగా విమాన యాత్రను అందుబాటులోకి తెచ్చినట్లు టీఎస్‌టీడీసీ ఎండీ మనోహర్‌ తెలిపారు. హైదరాబాద్‌లో విమానాశ్రయానికి చేర్చడం.. శిర్డీలో స్థానికంగా పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లడం కూడా తమదే బాధ్యత అని పేర్కొన్నారు. భోజనం, వసతి కూడా ఇందులోనే ఉంటుందన్నారు. ఈ ప్యాకేజీలో.. భక్తులు హైదరాబాద్‌ నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు విమానంలో బయల్దేరి 2.30 గంటలకు శిర్డీ చేరుకుంటారు. హోటల్‌లో బస, సాయంత్రం 4.30 గంటలకు శిర్డీ సాయి దర్శనం ఉంటుంది. సాయంత్రం ఆరతి కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత రాత్రి 7 గంటలకు బాబా థీమ్‌ పార్కులోని సౌండ్‌ అండ్‌ లైట్‌ షో తిలకించవచ్చు. రాత్రి బస చేసిన తర్వాత మరుసటి రోజు ఉదయం 8 గంటలకు పంచముఖి గణపతి మందిర దర్శనం ఉంటుంది. పాత శిర్డీ, ఖండోబా మందిర్‌, సాయి తీర్థం దర్శనాల అనంతరం తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు విమానంలో బయలుదేరి సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఇందులో కొన్ని దర్శన టిక్కెట్లు స్వయంగా కొనుక్కోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు 98485 40371, 98481 25720 నంబర్లలో సంప్రదించాలని టీఎస్‌టీడీసీ తెలిపింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z