Business

అమెజాన్‌లో మరోసారి కొలువుల కోత

అమెజాన్‌లో మరోసారి కొలువుల కోత

ప్రముఖ సంస్థల్లో కొలువుల కోత కొనసాగుతోంది. ఆర్థిక ఒడిదుడుకుల కారణంగా పలు సంస్థలు విడతవారీగా తమ ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపుతున్నాయి. తాజాగా ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజ సంస్థ అమెజాన్‌ మరోసారి ఉద్యోగులకు షాక్‌ ఇచ్చింది (Amazon LayOffs). అలెక్సా వాయిస్ అసిస్టెంట్ విభాగం (Alexa voice assistant unit) లో కోతలకు తెరతీసింది. లేఆఫ్స్‌కు సంబంధించి సదరు ఉద్యోగులకు సంస్థ మెయిల్‌ ద్వారా సమాచారం అందించింది.

మారిన వాణిజ్య ప్రాధాన్యాలు, జనరేటివ్ ఏఐపై దృష్టి మళ్లించడం తదితర కారణాలతో అలెక్సా వాయిస్ అసిస్టెంట్ విభాగంలో సిబ్బందిని తొలగిస్తున్నట్లు అమెజాన్‌ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ విభాగంలో కొన్ని వందల మందిని తొలగిస్తున్నట్లు చెప్పారు. అయితే, ఎంతమందికి ఉద్వాసన పలికారో వెల్లడించేందుకు సదరు ప్రతినిధి నిరాకరించారు.

లేఆఫ్స్‌పై అమెజాన్ వైస్ ప్రెసిడెంట్ డేనియల్ రౌష్ మాట్లాడుతూ.. ఉత్పాదకతను పెంచుకోవడానికి కృత్రిమ మేధస్సు ఆధారితమైన సామర్థ్యాలను పెంపొందించడంపై దృష్టి సారించినట్లు చెప్పారు. ఈ విభాగంలో కొత్త మార్పులు తీసుకురావడానికి ఖర్చు తగ్గింపుతో పాటు, వ్యాపార ప్రాధాన్యతలను మరింత పెంచడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z