Politics

ఏఐతో రూపొందించిన డీప్‌‌‌‌‌‌‌‌ ఫేక్ పై ఆందోళన వ్యక్తం చేసిన మోడీ

ఏఐతో రూపొందించిన డీప్‌‌‌‌‌‌‌‌ ఫేక్ పై ఆందోళన వ్యక్తం చేసిన మోడీ

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఏఐ)తో డీప్ ఫేక్ వీడియోలు తయారు చేస్తుండటంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది పెద్ద సంక్షోభానికి దారి తీస్తుందని హెచ్చరించారు. తాను పాట పాడినట్లుగా ఉన్న ఓ డీప్ ఫేక్ వీడియో వైరల్ కావడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఏఐ దుర్వినియోగం, ఎదురయ్యే ప్రభావాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని మీడియాను కోరారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన ‘దివాలీ మిలన్’ కార్యక్రమంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘నేను గార్బా ఫెస్టివల్‌‌‌‌‌‌‌‌లో పాడుతున్నట్లుగా ఉన్న ఓ వీడియోను చూశాను. నా స్కూల్ డేస్‌‌‌‌‌‌‌‌లో కూడా నేను అలా పాటలు పాడలేదు. నన్ను అభిమానించే వాళ్లు కూడా ఆ వీడియోను ఫార్వర్డ్ చేస్తున్నారు” అని అన్నారు. ఏఐతో రూపొందించిన డీప్‌‌‌‌‌‌‌‌ ఫేక్స్‌‌‌‌‌‌‌‌తో కొత్త సంక్షోభం వస్తున్నదని అన్నారు. సిగరెట్ వంటి ఉత్పత్తులపై హెల్త్ హెచ్చరికలు ఉంటాయని, డీప్‌‌‌‌‌‌‌‌ఫేక్‌‌‌‌‌‌‌‌ల విషయంలోనూ ఇలాంటి వార్నింగ్స్ ఉండాలని ఆయన సూచించారు.

‘‘గతంలో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలతో ఏదైనా ఓ సినిమా వచ్చి పోయేది. ఇప్పుడు అది పెద్ద సమస్యగా మారింది. సమాజంలోని కొన్ని వర్గాలను అగౌరవపరిచారనే కారణంతో అలాంటి చిత్రాలను ప్రదర్శించడం కష్టంగా మారింది. ఆయా చిత్రాల నిర్మాణానికి భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేసినప్పటికీ.. ప్రదర్శించనివ్వడం లేదు” అని చెప్పారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఇండియాను మార్చాలనే తన సంకల్పాన్ని ప్రస్తావిస్తూ.. ఇది గ్రౌండ్ రియాలిటీ అని చెప్పుకొచ్చారు. వోకల్ ఫర్ లోకల్ క్యాంపెయిన్‌‌‌‌‌‌‌‌కు ప్రజల మద్దతు లభించిందని, దీపావళి సందర్భంగా వారంలో రూ.4.5 లక్షల కోట్ల వ్యాపారం జరిగిందని తెలిపారు.
పౌరుల మరణాన్ని ఖండిస్తున్నం

వెస్ట్ ఆసియాలో జరుగుతున్న ఘటనలతో కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని ప్రధాని మోదీ ఆందోళ న వ్యక్తం చేశారు. ‘వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్’ వర్చువల్ సమిట్ రెండో ఎడిషన్‌‌‌‌‌‌‌‌లో ఆయన మాట్లాడారు. హమాస్-–ఇజ్రాయెల్ యుద్ధం వల్ల తలెత్తుతున్న పరిస్థితులను ఎదుర్కోవడానికి సంయమనంతో పాటు చర్చలు, దౌత్యానికి ఢిల్లీ ప్రాధాన్యతనిస్తున్నదని అన్నారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌‌‌‌‌‌‌‌పై జరిగిన దాడిని ఇండియా ఖండించిందని గుర్తు చేశారు. ఇదే సమయంలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న పోరులో పౌరులు చనిపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు స్పష్టం చేశారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z