DailyDose

వేడుకల చేసుకున్న విడాకులు కేసులో షాకింగ్ ఘటన

వేడుకల చేసుకున్న విడాకులు కేసులో షాకింగ్ ఘటన

భార్యభర్తల మధ్య, లేదా ఇరు వర్గాల మధ్య ఏదైనా విభేదాలు వచ్చిన పుడు ఇరుపక్షాల వాదనలు వినడం రివాజు. అపుడు మాత్రమే అసలు నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. లేదంటే అసలు విషయం పక్కకుపోయి.. ఉల్టా పల్టా అవుతుంది. విడాకుల ఊరేగింపు స్టోరీ గుర్తుందా. అత్తింట్లో బాధపడుతున్న కన్నకూతుర్ని గౌరవంగా మేళతాళాలతో ఇంటికి తెచ్చుకున్న తండ్రి అంటూ ఒక స్టోరీ వైరల్‌ అయింది. ఈ స్టోరీలో తాజాగా కొత్త ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చింది.

ముఖ్యంగా భార్తభర్తల విషయంలో నాణానికి రెండో వైపు విషయాలను తెలుసుకోవడం ఎంత అవసరమో ఈ వైరల్‌ స్టోరీ మరోసారి గుర్తు చేసింది. ఈ స్టోరీలో సాక్షి భర్త సచిన్‌ వాస్తవాలు వేరే ఉన్నాయి అంటూ కొత్త వాదనను వినిపించారు. ఆయన మాటల ప్రకారం ఇందులోని మరోకోణం పూర్తి భిన్నంగా ఉంది. సాక్షి తనను చాలా వేధించిందని, చాలా రకాలుగా ఇబ్బంది పెట్టిందని వీడియాతో చెప్పాడు. తన తల్లి తండ్రులను ఏమాత్రం భరించేది కాదని సాక్షి భర్త సచిన్‌ వాపోయాడు. తల్లి దండ్రులను, ఆసుపత్రిలో ఉన్న చుట్టాలను కూడా తనను కలవనిచ్చేది చూడనిచ్చే ది కాదని ఆరోపించారు.

సాక్షి గుప్తపై తానే తొలుత విడాకుల కేసు నమోదు చేశాననీ, ఈ సందర్భంగా కోటి, 15 లక్షల రూపాయలు భరణం ఇవ్వాలని వారు డిమాండ్‌ చేశారని తెలిపారు. దీంతో వన్‌ టైం సెటిల్‌మెంట్‌ కూడా చేసుకున్నామని వెల్లడించారు. అయితే తనకు వారసత్వంగా వచ్చిన ఇంటిని ఆక్రమించుకుని మొత్తం డబ్బు చెల్లించే దాకా బెదిరించిందని ఆరోపించారు. ఇంత చేసింతరువాత కూడా తనపై లేనిపోని ఆరోపణలుతో బ్యాండ్‌ బాజా అంటూ ఇంత హడావిడి చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన సాక్షి గుప్తాని ప్రశ్నించారు.

కాగా అత్తింటి వేధింపులతో ఇబ్బంది పడుతున్న తన కుమార్తెను బాజా భజంత్రీలు, బాణాసంచాతో ఊరేగింపుగా తీసుకొచ్చి విడాకులను కూడా పెళ్లి వేడుకలా ఘనంగా జరిపించి వార్తల్లో నిలిచాడు సాక్షి తండ్రి. ఝార్ఖండ్‌లోని రాంచీలో ఈఘటన ఈ చోటుచేసుకుంది. కైలాశ్‌నగర్‌ కుమ్​హర్టోలి ప్రాంతంలో నివసించే ప్రేమ్ గుప్తా గతేడాది ఏప్రిల్ 28న తన కుమార్తె సాక్షి గుప్తాకు వివాహం చేశాడు. అయితే పెళ్లైన కొన్ని రోజులకే సచిన్‌ నుంచి తన కుమార్తెకు వేధింపులు ఎదురు కావడం, దీనికి తోడు అంతకు ముందే అల్లుడికి రెండు సార్లు వివాహమైందని తమ దృష్టికి రావడంతో కన్నకూతురిని సగౌరవంగా ఇంటికి తెచ్చుకున్నామంటూ సోషల్‌మీడియాలో తండ్రి పేర్కొన్నాడు. అంతేకాదు ఆడపిల్లలకి వివాహ జీవితంలో ఇబ్బందులు ఎదురైనపుడు వారిని గౌరవంగా ఇంటికి తిరిగి తెచ్చుకోవాలి, వాళ్లు చాలా విలువైన వాళ్లు అంటూ సందేశం ఇచ్చాడు. దీంతో నాన్న అంటే ఇలా ఉండాలీ అంటూ ఈ కథనం గత నెలలో బాగా వైరల్‌ అయిన సంగతి తెలిసిందే.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z