Politics

కాంగ్రెస్ ఈ విధంగా ప్రజలను మోసం చేస్తుంది!

కాంగ్రెస్ ఈ విధంగా ప్రజలను మోసం చేస్తుంది!

ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బీఆర్‌ఎస్‌ సనత్‌నగర్‌ అభ్యర్థి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌(Talasani Srinivas Yadav) అన్నారు. శుక్రవారం సనత్‌నగర్‌లోని సుభాష్ నగర్‌, సాయిబాబానగర్‌, జైప్రకా్‌షనగర్‌, కైలా్‌షనగర్‌లలో తలసాని ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నాయకులు ఆచరణకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తప్పుడు హామీలతో అధికారంలోకి రావాలని కాంగ్రెస్‌ నాయకులు మోసపూరిత, అమలుకు సాధ్యం కాని హామీలను ఇస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని కాంగ్రెస్‌ నాయకులకే గ్యారెంటీ లేదు, వారు చెప్పే గ్యారెంటీలను ఎవరు నమ్ముతారని విమర్శించారు. ప్రజలు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్‌ నాయకత్వంలో ఎంతో అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. మంత్రి వెంట కార్పొరేటర్‌ కొలను లక్ష్మీబాల్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ డివిజన్‌ అధ్యక్షుడు కొలను బాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి శేఖర్‌, మాజీ అధ్యక్షుడు ఖలీల్‌, నాయకులు బాల రాజ్‌, సరాఫ్‌ సంతోష్‌, నోమాన్‌, సురేష్ గౌడ్‌, కరుణాకర్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, రాజేష్‌, పుష్పలత ఉన్నారు. రాంగోపాల్‌పేట్‌ డివిజన్‌ పరిధిలోని కుర్మబస్తీ, రంగ్రే బజార్‌, ఓల్డ్‌ గాస్మండిలలో తలసాని ఇంటింటికీ తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం చేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు అత్తెల్లి అరుణశ్రీనివాస్‌గౌడ్‌, కొశికె కిరణ్మయి, కిషోర్‌, అత్తెల్లి మల్లిఖార్జున్‌గౌడ్‌, రాజేందర్‌, చంద్రప్రకాష్‌, లావణ్య, కస్తూరి పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌(Chief Minister KCR) సహకారంతో సనత్‌నగర్‌ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశానని, ఇంకా చేయాల్సింది ఎంతో ఉందని, తనను మరోసారి ఆదరిస్తే ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని బీఆర్‌ఎస్‌ పార్టీ సనత్‌నగర్‌ అభ్యర్థి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం డివిజన్‌లోని శ్రీరాంనగర్‌లో మాజీ కార్పొరేటర్‌ శేషుకుమారి, పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం నివాసితుల సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడారు. నియోజకవర్గం ప్రజల ఆత్మీయతను ఎన్నటికీ మరిచిపోనన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ డివిజన్‌ అధ్యక్షుడు హన్మంతరావు, నాయకులు అశోక్‌ యాదవ్‌, కరుణాకర్‌రెడ్డి, కూతురు నర్సింహ, వనం శ్రీనివాస్‌, సంతోష్‌, కట్ట బలరాం, తదితరులు పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z