Devotional

అయోధ్య రామమందిరం…22న ప్రతిష్ఠ. 26 నుండి దర్శనాలు.

అయోధ్య రామమందిరం…22న ప్రతిష్ఠ. 26 నుండి దర్శనాలు.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య భవ్య రామ మందిరంలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠాపనకు ముహుర్తం ఖరారైంది. వచ్చే ఏడాది జనవరి 22న మధ్యాహ్నం 12.20 గంటలకు జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఈ వేడుకలను నాలుగు దశలుగా విభజించారు. తొలి దశలో పలు స్టీరింగ్‌ కమిటీలను ఏర్పాటు చేసి కార్యక్రమ నిర్వహణకు అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. రెండో దశలో 10 కోట్ల కుటుంబాలకు రాముడి చిత్రపటం, కరపత్రం అందించనున్నారు. మూడో దశలో జనవరి 22న దేశంలోని అనేక ప్రాంతాల్లో వేడుకలు నిర్వహించనున్నారు. నాలుగో దశలో జనవరి 26 నుంచి భక్తులకు రామయ్య దర్శనం కల్పించనున్నారు. మరోవైపు.. 14వ అయోధ్య నగర ప్రదక్షిణ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 21 (మంగళవారం) తెల్లవారుజామున 2 గంటలకు ప్రారంభంకానున్న ప్రదక్షిణ.. రాత్రి 11.38 గంటలకు ముగియనుంది. ఇందులో భాగంగా రామభక్తులు 42 కిలోమీటర్లు ప్రదక్షిణ చేయనున్నారు. రామ మందిరంలో అర్చకుల పోస్టులకు సంబంధించి దాదాపు 3 వేల మంది దరఖాస్తు చేసుకున్నట్లు రామ మందిర తీర్థ క్షేత్ర ట్రస్టు పేర్కొంది. వీరిలో 200 మందిని మెరిట్‌ ప్రాతిపదికన ఎంపిక చేసి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. వీరిలో 20 మందిని ఎంపిక చేయనున్నట్లు ట్రస్టు ప్రతినిధులు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z