NRI-NRT

హాంగ్‌కాంగ్‌లో దీపావళి వేడుకలు

హాంగ్‌కాంగ్‌లో దీపావళి వేడుకలు

హాంగ్ కాంగ్ లో కూడా తెలుగు వారున్నారు , 2023 దీపావళి వేడుకలు ఘనంగా ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య వారు సకుటుంబ సపరివార సమేతంగా ఇండియా క్లబ్ లో ఘనంగా నిర్వహించారు.

సమాఖ్య వ్యస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి jaya పీసపాటి తమ ప్రారంభ ప్రసంగం లో విచ్చేసిన వారిని ఆహ్వానిస్తూ తమ ప్రారంభ ప్రసంగంలో ప్రవాసులుగా కలిసి ఉండటంలో వున్న ఆనందం, ఒకరి కి ఒకరం ఉన్నామన్న భద్రతా భావం, పిల్లలకు పెద్దలకు ఒక కళా వేదిక కల్పించడం సాధ్యమని అందుకు అనడ్రు సమిష్టిగా కృషి చెయ్యాలని తెలుపుతూ , తమ కార్యవర్గ సభ్యలు రాజశేఖర్ మన్నె, రమాదేవి సారంగ, మాధురి అరవపల్లి, హరీన్ తుమ్మల, రమేష్ రేనిగుంట్ల , వారందరికీ వారి సేవలకు కృతఙ్ఞతలు తెలిపారు. తదనంతరం సంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభించారు.

చిన్న ఆదిత్య సార్ల శ్లోక పద్యాలతో వినాయకుడిని స్తుతిస్తూ కార్యక్రమం మొదలు పెట్టారు. ఆ తరువాత ప్రేక్షకులని పరవశింప చేసిన అద్వైత ఈయుణ్ణి తబలా ప్రదర్శన,
మన కళళ ప్రాముఖ్యతను చాటి చెప్పాయి.చిన్నారులు గుణ ఘట్టి మరియు భేవిన్ ఘట్టి మదురమైన లలితా సంగీతం వినిపించారు. అందరినీ ఆహ్లాద పరిచిన చిట్టి పొట్టి అడుగుల బుజ్జాయిలు జాహ్నవి బెల్లంకొండ, ధన్య సత్తినేని, అమృత ధర్మపురి, ముద్దోచ్చేలా తమ నృత్యాలతో అందరిని ఆశ్చర్యచకితుల్ని చేసారు.

ఆ తరువాత, హాంగ్ కాంగ్ తెలుగు భామల హుషారైన డాన్స్ స్టెప్పులతో దీపావళి పటాసుల వలె ప్రదర్శనలిచ్చారు. అందరూ సరదాగా ఖబుర్లు చెబుకుంటూ, ముచ్చట్లు వేసుకుంటూ నోరు ఊరించే భోజనం చేసిన తరువాత, నృత్య – గాన ప్రద్శనలతో అందరినీ ఆనంద పరిచిన వారికి బహుమతులు ఇవ్వడం జరిగంది. సాంస్కృతిక కార్యక్రమాని చక్కటి చిక్కటి అచ్చ తెలుగు లో భామలు రాధిక సంబతూర్ మరియు రాధిక నూతలపాటి చక్కగా నిర్వహించి అందరి మన్ననలు పొందారు.

హాంగ్ కాంగ్ లో మూడు దశాబ్దాలకు పైగా నివసించిన వైద్య నిపుణులు డాక్టర్ మోహన్ భాస్కరభట్ల గారు, సతీమణి సూర్య గారు ఆకస్మిక సందర్శన అందరిని ఆశ్చర్యపరుస్తూ ఎంతో ఆనందాన్నిచ్చింది. ఆ తరువాత అందరూ ఎంతో ఆనందంగా కలిసి గ్రూప్ ఫోటోలు,సెల్ఫీలు తీసుకొని వచ్చిన ప్రతి కుటుంబం తమ బహుమతులు ఉత్సాహంగా అందుకున్నారు.

చివరిగా దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించిన – పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అందరు మన దేశ జాతీయ గీతంతో కార్యక్రమాన్ని ముగించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z