Business

బంగారం ధర 1992 డాలర్లు

బంగారం ధర 1992 డాలర్లు

అంతర్జాతీయంగా సానుకూల పరిస్థితులు నెలకొనడంతో దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల బంగారం (24 క్యారట్స్) ధర రూ.380 పెరిగి రూ.62,150 పలికిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ పేర్కొంది. ఇంతకుముందు సెషన్‌లో 24 క్యారట్స్ బంగారం తులం రూ.61,770 పలికింది. మరోవైపు కిలో వెండి కూడా రూ.100 పెరిగి రూ.76,400 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఔన్స్ బంగారం ధర 1992 డాలర్లు, ఔన్స్ వెండి ధర 23.66 డాలర్లు పలికాయి.