* ఫ్లెయిర్ రైటింగ్ లిస్టింగ్ అదుర్స్
ప్రముఖ పెన్నుల తయారీ సంస్థ ‘ఫ్లెయిర్ రైటింగ్ ఇండస్ట్రీస్’ షేర్లు శుక్రవారం స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదయ్యాయి. ఈ మధ్య ఐపీఓకి వచ్చిన ఇతర కంపెనీల తరహాలోనే ఫ్లెయిర్ సైతం మదుపర్లకు మంచి లాభాలను తీసుకొచ్చింది. ఇష్యూ ధర రూ.304తో పోలిస్తే దాదాపు 65 శాతం లాభంతో షేర్లు లిస్టయ్యాయి (Flair Writing Listing). బీఎస్‌ఈలో రూ.503 దగ్గర, ఎన్‌ఎస్‌ఈలో రూ.501 దగ్గర ట్రేడింగ్ మొదలుపెట్టాయి. ఫలితంగా కంపెనీ మార్కెట్ విలువ లిస్టింగ్‌లో రూ.4,771 కోట్లుగా నమోదైంది.ఐపీఓలో షేర్లు అలాట్ అయినవారు కనీసం 49 షేర్లపై రూ.14,896 పెట్టుబడిగా పెట్టారు. ఈ లెక్కన వీరు కనీసం రూ.9,653 లిస్టింగ్ లాభాలను పొందారు. ఫ్లెయిర్ రైటింగ్ ఇండస్ట్రీస్ ఐపీఓ (Flair Writing IPO)కు మొత్తంగా 46.68 రెట్ల స్పందన కనిపించింది. ఇష్యూలో భాగంగా 1,44,13,188 షేర్లు జారీ చేయగా, 67,28,33,455 షేర్లకు బిడ్లు నమోదయ్యాయి. మొత్తం రూ.593 కోట్ల సమీకరణ లక్ష్యంతో పబ్లిక్ ఇష్యూకి రాగా.. దాదాపు రూ.20,000 కోట్లు విలువ చేసే షేర్లకు బిడ్లు అందాయి. క్యూఐబీ విభాగంలో 115.60 రెట్లు, ఎన్‌ఐఐల నుంచి 33.37 రెట్లు, రిటైల్ విభాగంలో 13.01 రెట్ల స్పందన వచ్చింది.ఐపీఓ (Flair Writing IPO) ద్వారా సమకూరిన నిధులను కంపెనీ గుజరాత్‌లో తయారీ కేంద్రాన్ని నెలకొల్పడానికి ఉపయోగించనుంది. మరికొన్ని నిధులను నిర్వహణ మూలధన అవసరాలకు వాడుకోనున్నట్లు తెలిపింది. రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకూ కొన్ని నిధులను కేటాయిస్తామని వెల్లడించింది. ‘ఫ్లెయిర్’ బ్రాండ్‌తో 45 ఏళ్లుగా ఈ కంపెనీ పెన్నులను విక్రయిస్తోంది. 2023 నాటికి తొమ్మిది శాతం మార్కెట్ వాటాతో తొలి మూడు అగ్రగామి కంపెనీల జాబితాలో ఉంది. పెన్నులు, కాలిక్యులేటర్లు సహా ఇతర స్టేషనరీ ఉత్పత్తులను తయారు చేస్తోంది. ఇటీవల గృహ వినియోగ వస్తువులు, స్టీల్ బాటిళ్ల తయారీలోకీ ప్రవేశించింది.
* హైదరాబాద్ ఇండ్లకు భలే డిమాండ్
హైదరాబాద్ ఇండ్లకు డిమాండ్ కొనసాగుతున్నది. ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో హైదరాబాద్‌సహా దేశవ్యాప్తంగా 8 ప్రధాన నగరాల్లో నమోదైన నివాస విక్రయాల వివరాలను ఆర్‌ఈఏ ఇండియాకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ డిజిటల్ ప్లాట్‌ఫామ్, హౌజింగ్ బ్రోకరేజీ ప్రాప్‌టైగర్.కామ్ వెల్లడించింది. ‘రియల్ ఇన్‌సైట్ రెసిడెన్షియల్-జూలై-సెప్టెంబర్ 2023’ పేరిట గురువారం ఓ నివేదికను విడుదల చేసింది. హైదరాబాద్, ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబై-ఎంఆర్, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, పుణె, అహ్మదాబాద్ నగరాల్లో సేల్స్‌పై ఈ రిపోర్టు వచ్చింది. ఈ నగరాల్లో హౌజింగ్ సేల్స్ 22 శాతం, కొత్త నిర్మాణాలు 17 శాతం పెరిగాయన్నది.
* వాహన వినియోగదారులకు కాస్త ఉపశమనం
వాహన వినియోగదారులకు కాస్త ఉపశమనం కలిగింది. నవంబర్ 30తో పోలిస్తే.. ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా 5పైసలు, 4పైసల చొప్పున తగ్గాయి. విజయవాడలో ఈ రోజు లీటర్ పెట్రోల్ ధర రూ. 111.87 గాను, లీటర్ డీజిల్ రూ.99.61 గా ఉంది. హైదరాబాద్ సిటీలో ఈ రోజు లీటర్ పెట్రోల్ ధర రూ. 109.66 గాను, లీటర్ డీజిల్ ధర రూ. 97.82 గా ఉంది, నిన్న నమోదైన ధరలతో పోల్చితే ఇవాళ హైదరాబాద్ లో పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి తేడా లేదు.దేశ రాజధాని ఢిల్లీలో ఈ రోజు లీటరు పెట్రోల్ ధర రూ. 96.72 గాను, లీటర్ డీజిల్ ధర రూ. 89.62 గా నమోదైంది, దేశ ఆర్ధిక రాజధాని ముంబై నగరంలో నేడు లీటర్ పెట్రోల్ ధర రూ. 106.31గాను, అలాగే డీజిల్ ధర లీటర్ రూ. 94.27గా నమోదు కాగా.. నిన్నటి ధరలతో పోల్చితే ఈ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి వ్యత్యాసం లేదు.
* యాపిల్ కార్డులు నిలిపివేయనున్న దిగ్గజ సంస్థ
గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ గోల్డ్‌మన్ సాక్స్‌తో కలిసి యాపిల్ సంస్థ యాపిల్‌కార్డులను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ కార్డ్‌ని అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌కు బదిలీ చేయడానికి గోల్డ్‌మన్ సాక్స్ మంతనాలు జరుపుతుందనే ఊహాగానాలు వెలువడ్డాయి. దాంతో వారి భాగస్వామ్యాన్ని రద్దు చేసుకోవాలని యాపిల్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా రెండు సంస్థలు ఈ విషయాన్ని ధ్రువీకరించాల్సి ఉంది. కొన్ని మీడియా కథనాల ప్రకారం వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం.. యాపిల్ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ గోల్డ్‌మన్ సాక్స్‌తో కలిసి వచ్చే 12-15 నెలల్లో యాపిల్ కార్డు నిలిపేయనుంది. 2019లో ప్రారంభించిన క్రెడిట్ కార్డ్ సేవలతోపాటు ఈ సంవత్సరంలో ప్రవేశపెట్టిన పొదుపు ఖాతాలను యాపిల్ గోల్డ్‌మన్ సాక్స్‌తో కలిసి నిర్వహిస్తోంది. అయితే యాపిల్‌కార్డును అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌కు బదిలీ చేయాలని గోల్డ్‌మన్ సాక్స్ భావిస్తున్నట్లు ఊహాగానాలు వచ్చాయి. దాంతో తమ భాగస్వామ్యాన్ని రద్దు చేయమని కోరుతూ యాపిల్ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.ఆగస్టులో యాపిల్ తన వినియోగదారులకు అధిక ఈల్డ్ ఇచ్చే పొదుపు ఖాతాలు ప్రారంభించింది. అది యాపిల్‌కార్డుకు అనుసంధానం చేసింది. అందులో దాదాపు రూ. 83 వేల కోట్ల డిపాజిట్లను సేకరించింది. దానికి 4.15 శాతం ఈల్డ్ అందిస్తుంది. గోల్డ్‌మన్ సాక్స్‌తో 2029 వరకు ఈ ఒప్పందం ఉంది. కానీ ప్రస్తుతం నెలకొన్ని అనిశ్చిత పరిస్థితుల ద్వారా ఈ డీల్‌ను రద్దుచేసుకోవాలని యాపిల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సేవింగ్స్ ఫీచర్‌ను ప్రవేశపెట్టినప్పటి నుంచి 97 శాతం మంది కస్టమర్‌లు రోజువారీ నగదును వారి ఖాతాల్లో జమ చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నట్లు యాపిల్ తెలిపింది.ఉద్యోగులు పూర్తి బాధ్యతతో, ఓపికతో పనిచేశారని కౌశిక్ ఖోనా రాశారు. అయితే గత 6 నెలలుగా జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నాం. దీని కోసం మేము ఆర్‌పి, కమిటీ ఆఫ్ క్రెడిటర్స్, వాడియా గ్రూప్ నుండి కూడా డిమాండ్ చేసాము. కానీ, ఎంత ప్రయత్నించినప్పటికీ, మేము విఫలమయ్యాము. మీ అందరికీ జీతం రావాలని కోరుకుంటున్నాను. కానీ, నేను ఇక ఇక్కడ ఉండలేను. కాబట్టి, నేను బయలుదేరాలని నిర్ణయించుకున్నాను. నేను క్షమాపణలు కోరుతున్నాను. మే 3 నుండి గో ఫస్ట్ విమానాలు మూసివేయబడ్డాయి. అమెరికన్ కంపెనీ ప్రాట్ & విట్నీ ఇంజిన్ వైఫల్యం కారణంగా గో ఫస్ట్ దాని విమానంలో సగానికి పైగా నేలపైకి వచ్చింది. అతని వద్ద నగదు కొరత, ఇంధనం కోసం కూడా డబ్బు లేదు. ఇంజిన్ సమస్య కారణంగా మూడు సంవత్సరాలలో సుమారు రూ.8.9 వేల కోట్ల నష్టం వాటిల్లిందని కౌశిక్ ఖోనా పేర్కొన్నారు. దీని మొదటి విమానం ముంబై, అహ్మదాబాద్ మధ్య నవంబర్ 2005లో జరిగింది. దీనిని గో ఎయిర్ అని పిలిచేవారు. ఎయిర్‌లైన్ దాని పేరును 2021లో గో ఫస్ట్‌గా మార్చింది.
* టాప్‌గేర్‌లో టూవీలర్ విక్రయాలు
ద్విచక్ర వాహన విక్రయాల్లో దేశీయ కంపెనీలు దూసుకెళ్లాయి. దీపావళి పండగ నేపథ్యంలో నవంబర్‌లో భారీగా విక్రయాలు నమోదయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాలు భారీగా పెరిగినట్లు ఆయా కంపెనీలు వెలువరించిన గణాంకాలు చెబుతున్నాయి. హోండా, టీవీఎస్, బజాజ్ కంపెనీలు మెరుగైన నంబర్లను నమోదు చేశాయి.నవంబర్ నెలలో Honda మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా 4,47,849 వాహనాలను విక్రయించింది. గతేడాది ఇదే నెలలో 3,73,234 యూనిట్లతో పోలిస్తే ఇది 20 శాతం అధికం. ఇందులో దేశీయంగా 4,20,677 యూనిట్లు విక్రయించగా.. 27,172 యూనిట్లను కంపెనీ ఎగుమతి చేసింది.ఆటోమొబైల్ కంపెనీ TVS నవంబర్ నెలలో 3,64,231 యూనిట్లను విక్రయించింది. ఇందులో 3,52,103 టూవీలర్లు ఉన్నాయి. గతేడాది ఇదే సమయంలో అమ్ముడైన 2,63,642తో పోలిస్తే విక్రయాలు 34 శాతం పెరగడం గమనార్హం. మొత్తం విక్రయాల్లో 1,72,836 మోటార్ సైకిళ్లు, 1,35,749 స్కూటర్లు అమ్ముడైనట్లు కంపెనీ తెలిపింది. 16,782 ఐక్యూబ్ విద్యుత్ ఎలక్ట్రిక్ స్కూటర్లను నవంబర్ నెలలో విక్రయించినట్లు కంపెనీ తెలిపింది.బజాజ్ ఆటో వాహన విక్రయాల్లో 31 శాతం వృద్ధిని నమోదు చేసింది. నవంబర్ నెలలో టూవీలర్లు, కమర్షియల్ వాహనాలు కలిపి 4,03,003 యూనిట్లను ఆ కంపెనీ విక్రయించింది. 3,49,048 టూవీలర్లను ఒక్క నెలలో విక్రయించింది. దేశీయ అమ్మకాల్లో 77 శాతం వృద్ధి నమోదు అవ్వగా.. ఎగుమతులు 6 శాతం మేర క్షీణించాయి.రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ నవంబర్‌లో 80,251 మోటార్ సైకిళ్లను విక్రయించింది. గతేడాది 70,766 మోటార్ సైకిళ్లను విక్రయించగా.. ఈ ఏడాది అక్టోబర్‌లో 84,435 వాహనాలను విక్రయించింది.
* లాభాల్లో ముగిసిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీలు వరుసగా నాలుగో రోజూ లాభపడ్డాయి. ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి దిగ్గజ కంపెనీలు రాణించడంతో సూచీలు రోజంతా లాభాల్లోనే పయనించాయి. ఫలితంగా నిఫ్టీ జీవనకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలతో పాటు దేశీయంగా సెప్టెంబర్ త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.6 శాతం వృద్ధిని నమోదు చేయడం మార్కెట్లలో ఉత్సాహం నింపింది.ఉదయం సెన్సెక్స్ (Sensex) 67,181.15 దగ్గర లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 67,564.33 దగ్గర గరిష్ఠాన్ని, 67,149.07 వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 492.75 పాయింట్లు లాభపడి 67,481.19 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 20,194.10 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 20,291.55 వద్ద జీవనకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 134.75 పాయింట్లు పెరిగి 20,267.90 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.29 వద్ద నిలిచింది.
👉 – Please join our whatsapp channel here –