Business

ఆస్తులు అమ్మేయడానికి సిద్దమైన హెచ్‌సీఎల్-వాణిజ్య వార్తలు

ఆస్తులు అమ్మేయడానికి సిద్దమైన హెచ్‌సీఎల్-వాణిజ్య వార్తలు

*  ఆస్తులు అమ్మేయడానికి సిద్దమైన హెచ్‌సీఎల్

భారతదేశంలోని అతిపెద్ద ఐటీ కంపెనీలలో ఒకటైన ‘హెచ్‌సీఎల్ టెక్నాలజీ’ (HCL Technology) బెంగళూరులోని తన కార్యాలయం ఆస్తులను విక్రయించడానికి సిద్దమైనట్లు సమాచారం. కంపెనీ ఈ కఠిన నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి? అనే వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..హెచ్‌సీఎల్ కంపెనీ, బెంగళూరు జిగానీ పారిశ్రామిక ప్రాంతంలోని సుమారు 27 ఎకరాల స్పెషల్ ఎకనామిక్ జోన్ క్యాంపస్ విక్రయించాలని చూస్తోంది. ఈ ప్రాపర్టీ విలువ సుమారు రూ. 550 కోట్లు వరకు ఉంటుందని అంచనా.అనవసర ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగానే హెచ్‌సీఎల్ తన ఆస్తులను విక్రయించాలనుకుంటున్నట్లు కొందరు చెబుతున్నారు. నాన్ కోర్ రియల్ ఎస్టేట్ అసెట్స్ మానిటైజే చేసేందుకు, కార్యకలాపాల్ని క్రమబద్ధీకరించేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చైర్‌పర్సన్ రోషిణీ నాడార్, కంపెనీని వేగంగా అభివృద్ధి చేయడానికి కావలసిన ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే కొత్త రంగాల్లో అడుగుపెట్టడానికి కూడా యోచిస్తున్నట్లు సమాచారం. కర్ణాటకలో సెమీకండక్టర్ చిప్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ఏకంగా 400 మిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టనున్నట్లు సమాచారం.

రికార్డులు సృష్టిస్తున్న ‘సలార్‌’ ట్రైల‌ర్‌

పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న తెలుగు సినిమాల్లో సలార్‌ (Salaar) ఒకటి. కేజీఎఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel), ప్రభాస్‌ (Prabhas) కాంబినేషన్‌లో వ‌స్తున్న ఈ చిత్రం రెండు పార్టులుగా రాబోతుంది. ఇప్పటికే విడుదల చేసిన Salaar Part-1 Ceasefire టీజర్‌ నెట్టింట వైరల్ అవుతూ.. మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతోంది. ఇదిలా ఉంటే డిసెంబ‌ర్ 1న ఈ సినిమా ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే.‘నీకోసం ఎరైనా అవుతా.. సొరైనా అవుతా.. నీ ఒక్కడికోసం.. నువ్వెప్పుడు పిలిచినా నేనిక్కడికొస్తా.. అంటూ ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్‌తో వ‌చ్చిన ఈ ట్రైల‌ర్ ప్ర‌భాస్ అభిమానుల‌కు గూజ్‌బంబ్స్ తెప్పిస్తుంది. ఇక క‌న్న‌డ‌తో పాటు తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం భాషల్లో విడుద‌ల చేసిన ఈ ట్రైలర్ తాజాగా యూట్యూబ్‍లో రికార్డులు బ‌ద్ద‌లు కొడుతుంది.

*  ఆ మోటారు సైకిళ్లు రీకాల్

ప్రముఖ టూ వీలర్స్ సంస్థ హోండా మోటారు సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా (Honda Motor Cycle and Scooters India-HMSI) కొన్ని మోడల్ టూ వీలర్స్ రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. 350సీసీ సెగ్మెంట్‌లో మార్కెట్లోకి తెచ్చిన హెచ్ఎన్ఈఎస్ఎస్ సీబీ 350, సీబీ350ఆర్ఎస్ మోడల్ మోటారు సైకిళ్లు రీకాల్ చేస్తున్నట్లు తెలిపింది. ఒక విడి భాగంలో లోపం సరి చేసి ఇవ్వడానికే ఈ రీకాల్ చేపట్టామన్నది. కానీ ఎన్ని మోటారు సైకిళ్లు రీకాల్ చేస్తున్న సంగతి తెలుపలేదు.స్టాఫ్ లైట్ స్విచ్‌లో రబ్బర్ పార్ట్ తయారీలో లోపం ఉన్నట్లు హోండా మోటారు సైకిల్స్ పేర్కొంది. దీనివల్ల రబ్బర్‌లో క్రాక్ వచ్చే అవకాశం ఉందని, దీంతో స్విచ్ లోపలికి నీరు చేరు చాన్స్ ఉన్నదని తెలిపింది. 2020 అక్టోబర్ నుంచి ఈ ఏడాది జనవరి మధ్య తయారైన బైక్స్‌లో ఈ లోపం తలెత్తినట్లు హోండా వివరించింది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ మోటారు సైకిళ్లు రీకాల్ చేస్తున్నామని తెలిపింది.హోండా మోటారు సైకిల్స్ అండ్ స్కూటర్స్ బిగ్ వింగ్ డీలర్ల వద్ద ఈ నెల రెండో వారం నుంచి ఈ పార్ట్ మార్పిడి జరుగుతుందని పేర్కొంది. వాహనాల యజమానులు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన పని లేదని తెలిపింది. వారంటీ ఉన్నా, లేకున్నా ఉచితంగా పార్ట్ రీప్లేస్ చేస్తామని స్పష్టం చేసింది. సీబీ350 డీఎల్ఎక్స్ వేరియంట్ మోటారు సైకిల్ రూ.1.99 లక్షలు (ఎక్స్ షోరూమ్), డీఎల్ఎక్స్ ప్రో వేరియంట్ ధర రూ.2.17 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతున్నాయి.

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

బంగారం కొనుగోలు చేసే వారికి షాకింగ్ న్యూస్. గత నాలుగు రోజులు నుంచి గోల్డ్ ధరల్లో హెచ్చు, తగ్గులు కనిపిస్తున్నాయి. ఇవాళ ఈ ధరలు పెరిగాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.200 కు పెరిగి రూ.57,700 గా ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.220 పెరిగి రూ.62,950 గా ఉంది.నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే,22 క్యారెట్ల బంగారం ధర – రూ.57,700,24 క్యారెట్ల బంగారం ధర – రూ.62,950.నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ.57,700,24 క్యారెట్ల బంగారం ధర – రూ.62,950.

* యువ వ్యాపారవేత్త కామెంట్స్‌పై ట్రోలింగ్‌

ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ‘ఎన్ఆర్ నారాయణ మూర్తి’ గత కొన్ని రోజులకు ముందు భారతదేశం అభివృద్ధి చెందాలంటే వారానికి 70 గంటల పని అవసరమని వెల్లడించారు.. ఈ విషయం మీద సాధారణ ఉద్యోగుల దగ్గర నుంచి ప్రముఖ వరకు పెద్ద ఎత్తున స్పందించారు. ఇదిలా ఉండగానే ఇటీవల ఓ యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్ రోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు పనిచేసేవారు అవసరం లేదంటూ వెల్లడించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఈ రోజుల్లో చాలా మంది యువత ఉద్యోగం చేయడానికంటే కూడా సొంతంగా ఏదైనా బిజినెస్ చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు ‘అనుభవ్ దూబే’ (Anubhav Dubey). 23 ఏళ్ల వయసులోనే స్టార్టప్ కంపెనీ ప్రారభించి కోట్లు సంపాదిస్తున్నారు.చాయ్ సుత్తా బార్ (Chai Sutta Bar) పేరుతో ఒక చాయ్ కంపెనీ ప్రారంభించాడు, ఇది ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 500 అవుట్‌లెట్‌లను కలిగి ఉంది. ఈ సంస్థ విలువ రూ. 150 కోట్లు కావడం గమనార్హం. తక్కువ వయసులోనే సక్సెస్ సాధించి ఎంతోమంది యువకులకు రోల్ మోడల్‌గా నిలిచాడు.అనుభవ్ దూబే ఇటీవల తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేసే వారి కోసం వెతకడం లేదని, ఇక్కడ సైన్యం తయారు చేస్తున్నామని, ట్వీట్ చేశారు. ఇది కాస్త సోషల్ మీడియాలో నిమిషాల్లోనే వైరల్ అయిపోయింది. దీనిపైన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.నిజానికి అనుభవ్ దూబే తన బృందాన్ని మోటివేట్ చేయడానికి ఇలా చెప్పినట్లు తెలుస్తోంది, అయినప్పటికీ ఇది చాలామందికి కోపాన్ని తెప్పించింది. చాయ్ అమ్మడం పెద్ద విషయం కాదని ఒకరు కామెంట్ చేస్తే, మరొకరు చాయ్ అమ్మడానికి సైన్యం ఎందుకని ప్రశ్నించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z