Business

వాట్సాప్ వినియోగదారులకు షాక్

వాట్సాప్ వినియోగదారులకు షాక్

మెటా యాజమాన్యంలోని వాట్సాప్ (WhatsApp) ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్, 2021 ప్రకారం.. భారతదేశంలో సుమారు 75 లక్షల కంటే ఎక్కువ నకిలీ అకౌంట్స్ నిషేదించింది. 2023 అక్టోబర్ 01 నుంచి 31 మధ్య 7548000 ఖాతాలను నిషేదించింది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

వాట్సాప్ నెలవారీ నివేదికలో వివరించిన విధంగా.. 19,19,000 వినియోగదారు నివేదికల కంటే ముందుగానే నిషేధించడం జరిగింది. అక్టోబర్‌లో దేశంలో రికార్డు స్థాయిలో 9,063 ఫిర్యాదులను అందుకున్నట్లు సమాచారం. ఇందులో ఖాతాను నిషేధించడం లేదా గతంలో నిషేధించబడిన ఖాతాను పునరుద్ధరించడం వంటివి ఉన్నాయి.

దేశంలో 500 మిలియన్ల కంటే ఎక్కువ వినియోగదారుల సంఖ్యను కలిగి ఉన్న వాట్సాప్ అక్టోబర్‌లో 9,063 ఫిర్యాదులను అందుకున్నట్లు.. వీటిపైన 12 చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే వాట్సాప్ ఒక ఖాతాను నిషేధించడం లేదా గతంలో నిషేధించిన దాన్ని పునరుద్ధరించడం వంటి పరిష్కార చర్యలను సూచిస్తుంది.

వినియోగదారు ఫిర్యాదులకు సంబంధించిన సమగ్ర వివరాలను పరిగణలోకి తీసుకుని, దుర్వినియోగాన్ని ఎదుర్కోవడానికి సరైన చర్యలు తీసుకుంటోంది.

వాట్సాప్ సెప్టెంబర్ 1, 2023 నుంచి సెప్టెంబర్ 30 వరకు మొత్తం 7,111,000 ఖాతాలను బ్యాన్ చేసింది. ఇందులో వినియోగదారు నివేదికలను స్వీకరించడానికి ముందు 2,571,000 ఖాతాలు ముందస్తుగా నిషేధించారు. అప్పుడు వచ్చిన ఫిర్యాదుల్లో అకౌంట్ సపోర్ట్ (1,031), బ్యాన్ అప్పీల్ (7,396), అదర్ సపోర్ట్ (1,518), ప్రొడక్ట్ సపోర్ట్ (370), సేఫ్టీ (127) వంటి కేటగిరీల్లో 10,442 యూజర్ రిపోర్ట్‌లను స్వీకరించినట్లు సమాచారం

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z