తిరుమల (Tirumala) శ్రీవారి భక్తుల సౌకర్యార్థం 2024 మార్చి నెలకు సంబంధించి ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్న శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవాటికెట్ల కోటా వివరాలను శనివారం తితిదే (TTD) ప్రకటించింది.
డిసెంబరు 18న ఉదయం 10గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10గంటల వరకు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల లక్కీడిప్ కోసం నమోదు చేసుకోవచ్చు.
డిసెంబరు 21వ తేదీ ఉదయం 10గంటలకు శ్రీవారి ఆర్జితసేవలైన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవా టికెట్ల కోటా విడుదల చేస్తారు.
డిసెంబరు 21వ తేదీ ఉదయం 10గంటలకు శ్రీవారి తెప్పోత్సవాల టికెట్లను భక్తులకు అందుబాటులో ఉంచుతారు.
డిసెంబరు 21న మధ్యాహ్నం 3గంటలకు శ్రీవారి వర్చువల్ సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తారు.
డిసెంబరు 23న ఉదయం 10గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు అందుబాటులో ఉంటాయి.
డిసెంబరు 23న ఉదయం 11గంటలకు శ్రీవాణి ట్రస్ట్ దాతల దర్శనం, గదుల కోటాను విడుదల చేస్తారు.
డిసెంబరు 23న మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తారు.
డిసెంబరు 25న ఉదయం 10గంటలకు రూ.300ల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్‌లైన్లో భక్తులకు అందుబాటులో ఉంచుతారు.
డిసెంబరు 25న మధ్యాహ్నం 3గంటలకు తిరుమల, తిరుపతిలోని గదుల కోటాను విడుదల చేస్తారు.
డిసెంబరు 27న ఉదయం 11గంటలకు తిరుమల, తిరుపతిలోని శ్రీవారి సేవ కోటాను, అదే రోజు మధ్యాహ్నం 12గంటలకు నవనీత సేవ కోటాను, మధ్యాహ్నం 3 గంటలకు పరకామణి సేవ కోటాను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు.
భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని తితిదే అధికారులు విజ్ఞప్తి చేశారు.
👉 – Please join our whatsapp channel here –