DailyDose

స్టోన్ క్రషింగ్ కాలుష్యంపై శాస్త్రీయ అధ్యయనాలు నిర్వహించాలి!

స్టోన్ క్రషింగ్ కాలుష్యంపై శాస్త్రీయ అధ్యయనాలు నిర్వహించాలి!

స్టోన్‌ క్రషర్ల కాలుష్యంపై శాస్త్రీయ అధ్యయనం చేయాలని, అవి పర్యావరణ అనుమతులు తీసుకోవాలో లేదో చెప్పాలని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డుకు (సీపీసీబీ) సుప్రీంకోర్టు సూచించింది. ‘సీపీసీబీ అవసరమైన డేటా తీసుకుని శాస్త్రీయంగా అధ్యయనం జరపాలి. ఎనిమిది వారాల్లోగా నివేదిక సమర్పించాలి’ అని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. పశ్చిమ బెంగాల్లో స్టోన్‌ క్రషర్లకు పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సిందేనని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఇచ్చిన ఆదేశాలను తదుపరి విచారణ జరిగే వరకూ పక్కనబెట్టింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z