Politics

TS: సమన్వయకర్తలను నియమించిన కాంగ్రెస్‌

TS: సమన్వయకర్తలను నియమించిన కాంగ్రెస్‌

సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్‌ అధిష్ఠానం చర్యలు వేగవంతం చేసింది. 28 రాష్ట్రాల్లోని ఎంపీ స్థానాలకు సమన్వయకర్తలను నియమించింది. తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల బాధ్యతలను పలువురు మంత్రులు, ముఖ్యనేతలకు అప్పగించింది. మహబూబ్‌నగర్‌, చేవెళ్ల స్థానాల బాధ్యతలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఇచ్చింది. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ నియోజకవర్గాలను ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క సమన్వయం చేయనున్నారు. మిగతా స్థానాల సమన్వయకర్తల వివరాలను పరిశీలిస్తే..

మల్కాజ్‌గిరి – తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం, మహబూబాబాద్‌ – పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

వరంగల్‌- కొండా సురేఖ

ఆదిలాబాద్‌ – సీతక్క

నల్గొండ – ఉత్తమ్‌కుమార్‌రెడ్డి,

భువనగిరి – కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

నాగర్‌కర్నూల్‌ – జూపల్లి కృష్ణారావు

మెదక్‌ – దామోదర రాజనర్సింహ

నిజామాబాద్‌ – జీవన్‌రెడ్డి

జహీరాబాద్ – సుదర్శన్‌రెడ్డి

పెద్దపల్లి – శ్రీధర్‌బాబు,

కరీంనగర్‌ – పొన్నం ప్రభాకర్‌

ఆంధ్రప్రదేశ్‌ లోక్‌సభ నియోజకవర్గాల సమన్వయ కర్తలు వీళ్లే..

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z