Politics

కొత్త జిల్లాలు రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా?

కొత్త జిల్లాలు రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా?

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేసిన వాళ్లు ఇప్పుడు పునరాలోచనలో పడ్డారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో జహీరాబాద్‌ లోక్‌సభ సన్నాహక సమావేశం జరిగింది. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.

‘‘అసెంబ్లీ ఎన్నికల్లో మూడింట ఒకవంతు సీట్లు గెలిచాం. అప్పులు చూపించి హామీల నుంచి తప్పించుకోవాలని కాంగ్రెస్‌ చూస్తోంది. నెల రోజుల్లోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం అప్రతిష్ఠ మూటగట్టుకుంది. పార్లమెంటు ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరగబోతోంది. పోటీలో భారాసకే పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. జిల్లాల సంఖ్య తగ్గ్గిచేందుకు సీఎం రేవంత్ కమిషన్ వేస్తామంటున్నారు. కొత్త జిల్లాలు రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా? అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగులను మార్చి ఉంటే బాగుండేది. పార్లమెంటు ఎన్నికల్లో అలాంటి పొరపాట్లు జరగనివ్వం. కాంగ్రెస్‌ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఒత్తిడి పెంచుదాం’’ అని చెప్పారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z