గాల్లో ఎగిరే విద్యుత్ ట్యాక్సీ మోడల్‌ను హ్యూందాయ్ మోటార్స్ ఆవిష్కరించింది. ఇందుకు ‘2024 కన్జూమర్ ఎలక్టాన్రిక్స్ షో’ వేదికైంది. నిట్టనిలువుగా ల్యాండింగ్, టేకాఫ్ చేయగల సామర్థ్యం ఉన్న ఈ ట్యాక్సీని హ్యుందాయ్ మోటార్ గ్రూప్‌నకు చెందిన అడ్వాన్స్‌డ్ ఎయిర్ మొబిలిటీ కంపెనీ సూపర్‌నల్ తయారు చేసింది. నగరంలో రోజువారీ కార్యకలాపాలకు అంటే 25 నుంచి 40 మైళ్ల దూరం ప్రయాణించేందుకు ఇది పనికొస్తుందని కంపెనీ వివరించింది.
తక్కువ శబ్దంతో: ఎస్-ఏ2గా పిలుస్తున్న ఈ ఎగిరే ట్యాక్సీ గంటకు 120 మైళ్ల (193 కి.మీ) వేగంతో దూసుకెళ్లగలదు. 1500 అడుగుల ఎత్తులో ప్రయాణించగలదు. పైలట్, నలుగురు ప్యాసింజర్లకు ఇందులో చోటుంది. విద్యుత్ ప్రొపల్షన్ ఆర్కిటెక్చర్ ఫీచర్‌తో వస్తున్న ఈ ట్యాక్సీకి ఎనిమిది రోటర్లు ఉంటాయి. వర్టికల్ ల్యాండింగ్, టేకాఫ్ సమయంలో ఇది 65 డెసిబుల్స్; గాల్లో ఎగిరే సమయంలో 45 డెసిబుల్స్ శబ్దం మాత్రమే వెలువడుతుంది.
ఆకట్టుకునే డిజైన్‌తో పాటు భద్రత కూడా: ట్యాక్సీ డిజైన్ కోసం హ్యుందాయ్ మోటార్ గ్రూప్ డిజైనర్లతో జట్టు కట్టింది సూపర్‌నల్ గాల్లో ఎగరడానికి అనుకూలంగా ఉండటం సహా ఆకట్టుకునేలా కనిపించేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపింది. ప్రయాణికుల భద్రత, సౌకర్యంపై ప్రధానంగా దృష్టి సారించి ఈ ట్యాక్సీని అభివృద్ధి చేసినట్లు కంపెనీ వెల్లడించింది. ప్రపంచస్థాయి విమానయాన ప్రమాణాలకు అనుగుణంగా ఈ ట్యాక్సీలో ఫీచర్లు ఉన్నాయని పేర్కొంది.
👉 – Please join our whatsapp channel here –