DailyDose

బేగంపేట విమానాశ్రయంలో ‘వింగ్స్‌ ఇండియా’ ప్రదర్శన

బేగంపేట విమానాశ్రయంలో ‘వింగ్స్‌ ఇండియా’ ప్రదర్శన

కేంద్ర పౌర విమానయానశాఖ, భారతీయ పరిశ్రమలు, తెలంగాణ ప్రభుత్వం, వాణిజ్య మండళ్ల సమాఖ్య(ఫిక్కి)ల ఆధ్వర్యంలో ఈ నెల 18 నుంచి 21 వరకు బేగంపేట విమానాశ్రయంలో నిర్వహించనున్న వింగ్స్‌ ఇండియా-2024 వైమానిక ప్రదర్శనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. వైమానిక ప్రదర్శన ఏర్పాట్లపై మంగళవారం సచివాలయంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. విమానాలతోపాటు వైమానిక ఉత్పత్తుల ప్రదర్శనకు ప్రముఖులు హాజరవుతారని తెలిపారు. కార్యక్రమానికి చివరి రెండు రోజుల్లో లక్ష మందికి పైగా సందర్శకులు వచ్చే అవకాశం ఉన్నందున ఆ మేరకు పార్కింగ్‌ సదుపాయం కల్పించాలన్నారు. సమావేశంలో కేంద్ర పౌర విమానయానశాఖ సంయుక్త కార్యదర్శి అసంగ్బా చుబా, తెలంగాణ రోడ్లు, భవనాలశాఖ ముఖ్యకార్యదర్శి శ్రీనివాస్‌రాజు, ఫిక్కి ప్రతినిధి మనోజ్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌, వైమానిక సంస్థ సంచాలకుడు భరత్‌రెడ్డి, బేగంపేట విమానాశ్రయ డైరెక్టర్‌ పీకే హజారే తదితరులు పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z