Devotional

రాశిఫలాలు:12-01-2024

రాశిఫలాలు:12-01-2024

మేషం

బంధుమిత్రులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. ఉద్యోగాలలో ఆశించిన స్థాన చలనాలు, మార్పులు ఉంటాయి. ప్రారంభించిన పనుల్ని సకాలం పూర్తి చేస్తారు. వ్యాపారాభివృద్ధి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. వృత్తి, ఉద్యోగాలపరంగానే కాక కుటుంబపరంగా కూడా రోజు ప్రశాంతంగా గడిచిపోతుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా సాగిపో తుంది.

వృషభం

వృత్తి వ్యాపారాల్లో పెట్టుబడులకు తగ్గ లాభాలు దక్కుతాయి. ఉద్యోగంలో తగిన ఆదరణ పెరుగుతుంది. ప్రతిభకు, శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా కాల క్షేపం చేస్తారు. తండ్రి నుంచి ఆశించిన సహాయం అందుతుంది. ఆస్తి సంబంధమైన వ్యవహారాల్లో ప్రయోజనం పొందుతారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. పిల్లల నుంచి శుభ వార్తలు వినడం జరుగుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఒకరిద్దరు మిత్రులను ఆర్థికంగా ఆదుకుంటారు.

మిథునం

పెళ్లి సంబంధం విషయంలో దూర ప్రాంతంలోని బంధువుల నుంచి శుభ వార్త అందుతుంది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. పిల్లలకు నూతన విద్య, ఉద్యోగావకాశాలు లభి స్తాయి. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. వృత్తి, ఉద్యోగా లలో శుభ పరిణామాలు చోటు చేసుకుం టాయి. ఒకటి రెండు కుటుంబ సమస్యలు కొద్ది ప్రయ త్నంతో పరిష్కారం అవుతాయి. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగు తుంది.

కర్కాటకం

ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. కుటుంబానికి సంబంధించి ఆశించిన శుభవార్తలు వింటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ముఖ్యమైన పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. సోదరులతో సఖ్యత పెరుగుతుంది. మిత్రుల నుంచి ధన, వస్తు లాభాలు పొందుతారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా అనుకూల పరిస్థితులుం టాయి. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పాటించడం

సింహం

కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. మిత్రులతో ఏర్పడిన విభేదాలను పరి ష్కరించుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా కొనసాగుతాయి. గృహ నిర్మాణ పనులు మందకొడిగా సాగుతాయి. దూర ప్రాంతం నుంచి అందిన ఒక వార్త ఆనందం కలిగిస్తుంది. స్నేహి తుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. మనసులోని కోరిక ఒకటి నెరవేరుతుంది. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. స్వల్ప అనారోగ్యాలకు అవకాశం ఉంది.

కన్య

ఉద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఉద్యోగాలలో ఆశించిన ప్రోత్సాహకాలు అందు కుంటారు. బంధుమిత్రులతో ఒక శుభకార్యంలో పాల్గొంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ విషయాల్లో సొంత నిర్ణయాలు ఉపయోగకరం. నిరుద్యోగులు చిరుద్యోగంలో చేరాల్సి వస్తుంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగిపోతాయి. ఆదాయం పరవాలేదనిపిస్తుంది. ఖర్చుల్ని అదుపు చేస్తారు. ఎవరికీ హామీలు ఉండవద్దు.

తుల

దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. బంధుమిత్రులతో సరదాగా కాల క్షేపం చేస్తారు. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. ఆస్తి విలువ పెరుగుతుంది. నిరుద్యో గులకు శుభ వార్త అందుతుంది. ఆదాయం పెరిగి, ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. కుటుం బానికి సంబంధించి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారంలో కలిసి వస్తుంది. ఏ ప్రయత్నం ప్రారంభిస్తే అది నెరవేరుతుంది.

వృశ్చికం

మంచి పరిచయాలు ఏర్పడతాయి. రోజంతా ఉత్సాహంగా గడిచిపోతుంది. కుటుంబ సభ్యులతో శుభ కార్యంలో పాల్గొంటారు. సోదరులతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది. ఉద్యోగం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి నిపుణులకు సమయం అనుకూలంగా ఉంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో చేరే సూచనలు న్నాయి.

ధనుస్సు

వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. పదోన్నతులకు అవకాశాలు మెరుగుపడతాయి. నిరుద్యోగులు పోటీ పరీక్షలు లేదా ఇంటర్వ్యూలలో విజయాలు సాధిస్తారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో ధైర్యంగా ముందుకు సాగు తారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరి ష్కారం అవుతుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆదాయ వృద్ధికి అవకాశ ముంది.

మకరం

నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆఫర్లు అందుతాయి. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహం కలిగిస్తాయి. జీవిత భాగస్వామి సహాయంతో కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వివాహ ప్రయత్నాలు సానుకూలపడతాయి. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆదాయం బాగానే ఉంటుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు.

కుంభం

వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలు అందుకుంటారు. వ్యయ ప్రయాసలున్నా ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతి లేదా స్థాన చలనానికి అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా ఉంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆదాయం పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఆరోగ్యం పరవాలేదు.

మీనం

కుటుంబ సభ్యులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. ఆకస్మిక ధన లాభానికి అవకాశముంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలు అనుకూలంగా సాగిపోతాయి.ఆస్తి వివాదానికి సంబంధించి పరిష్కారం కుదిరే అవకాశం ఉంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఇప్పుడు తీసుకునే నిర్ణయాల వల్ల, చేసే ప్రయత్నాల వల్ల మున్ముందు కలిసి వస్తుంది. నిరుద్యోగులు శుభవార్త వినడం జరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z