Politics

ఆ పార్టీకి ముందుంది ముసళ్ల పండగ!

ఆ పార్టీకి ముందుంది ముసళ్ల పండగ!

కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడూ జాతీయ దృక్పథంతో వ్యవహరించలేదని కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

‘‘ధార్మిక కార్యక్రమాన్ని కాంగ్రెస్‌ పార్టీ బహిష్కరిస్తోంది. ఆ పార్టీ.. హిందూ వ్యతిరేక ధోరణి ఏ విధంగా ఉందో అర్థమవుతోంది. రామమందిర ప్రాణప్రతిష్ఠ జరుగుతుంటే వారికి కంటగింపుగా ఉంది. దేశంలో రోజు రోజుకూ ఆధ్యాత్మికత పెరుగుతోంది. అయోధ్యకు రావడం లేదని కాంగ్రెస్‌ పార్టీ చెప్పడం.. రాజకీయ దృక్పథంతో తీసుకున్న నిర్ణయమే. ఆ పార్టీ ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోంది. సరయూ నదిలో ప్రాణాలు కోల్పోయిన అమరుల ఆత్మలకు 22న శాంతి చేకూరుతుంది. జీ20, పార్లమెంట్‌, అఖిలపక్షం, ఎన్నికల కమిషన్‌ సమావేశాలను కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. ఇలా చేయడం వారికి అలవాటుగా మారింది. ఆ పార్టీకి ముందుంది ముసళ్ల పండగ’’ అని వ్యాఖ్యానించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z