సంక్రాంతి నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. శుక్రవారం నుంచి పండగ సెలవులు కావడంతో ప్రజలు నగరం నుంచి పల్లెబాట పట్టారు. ముఖ్యంగా ఏపీ వైపు వెళ్లే వాహనాలతో హైవేపై రద్దీ నెలకొంది. చౌటుప్పల్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌తోపాటు పలు కూడళ్ల వద్ద ట్రాఫిక్ నిలిచిపోతోంది. రద్దీ నియంత్రణకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
పంతంగి వద్ద టోల్ ప్లాజా దాటేందుకు సుమారు పది నిమిషాలకుపైనే సమయం పడుతోంది. మొత్తం 18 టోల్ బూత్‌లు ఉండగా విజయవాడ మార్గంలోనే 10 బూత్‌లను తెరిచి వాహనాలను పంపిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ నిదానంగా వెళ్లాలని వాహనదారులకు పోలీసులు సూచిస్తున్నారు.
👉 – Please join our whatsapp channel here –