Health

గర్భిణులపై వాతావరణ ప్రభావం పడుతుందా?

గర్భిణులపై వాతావరణ ప్రభావం పడుతుందా?

ఇంటి వెలుపల వాతావరణంలోని వేడి, తేమ గర్భిణులను ప్రభావితం చేసి, వారి పిల్లల రక్తపోటు (బీపీ)లో హెచ్చుతగ్గులు తెస్తాయని బ్రిటన్‌, ఫ్రాన్స్‌, నెదర్లాండ్స్‌, ఫిన్లాండ్‌లలో జరిగిన పరిశోధనలు తేల్చాయి. 3-10 ఏళ్ల వయసు పిల్లల్లో ఈ మార్పులు కనిపిస్తాయి. గర్భిణులు ఎక్కువ తేమకు గురైతే ఆమె పిల్లల రక్తపోటు పెరుగుతుందని, అధిక ఉష్ణోగ్రతకు గురైతే ఆ చిన్నారుల బీపీ తగ్గుతుందని తేలింది. ఉష్ణోగ్రత తక్కువగా ఉంటే పిల్లల రక్తపోటు పెరుగుతుంది. తక్కువ ఉష్ణోగ్రత వల్ల సహానుభూత నాడీమండలం క్రియాశీలమై రక్తనాళాలు సంకోచించేట్లు చేస్తుంది. దీనివల్ల రక్తపోటు, గుండె కొట్టుకునే రేటు పెరుగుతాయి. మూడేళ్ల నుంచి 24 ఏళ్ల వయసు మధ్య ఉన్న 7,000 మందిపై బ్రిటన్‌లో పరిశోధనలు జరిగాయి. మూడు ఐరోపా దేశాల్లో 9,000 మందిపై పరిశోధన చేశారు. చిన్న వయసులో అధిక రక్తపోటు పెద్దయ్యాక కూడా వెంటాడుతుంది. దీనివల్ల గుండె, మూత్రపిండ సంబంధ వ్యాధులు వస్తాయి. పక్షవాత ప్రమాదమూ పొంచి ఉంటుంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z