చలికాలం సమస్యల్లో చుండ్రు ఒకటి. దీనివల్ల మాడు పొడిబారడం, దురద వంటి సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఈ డాండ్రఫ్ సమస్య ఎక్కువ అయితే వెంట్రుకలు కూడా రాలిపోతాయి. జుట్టు కూడా పలచబడుతుంది. కాబట్టి చుండ్రు సమస్యను వీలైనంత తొందరగా వదిలించుకుంటే మంచిదని అందరూ భావిస్తుంటారు. అయితే చుండ్రు రావడానికి ప్రత్యేకంగా ఒకటే కారణం ఉంటుందని చెప్పలేం. వాతావరణ మార్పులు, షాంపూలు, కొవ్వు పదార్థాలు మితిమీరి తినడం, అధిక చెమట, కాలుష్యం ఇలా రకరకాల సమస్యలతో డాండ్రఫ్ సమస్యలు వస్తుంటాయి. ఇలా ఏ కారణంతో చుండ్రు వచ్చినప్పటికీ.. కొన్ని టిప్స్ పాటించడం ద్వారా వాటిని దూరం చేసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
☞ హెయిర్ డ్రయర్‌ను ఉపయోగించడం వల్ల మాడుకు నేరుగా వేడి తగులుతుంది. అధిక వేడి చుండ్రు తీవ్రతను పెంచుతుంది. పొడి టవల్‌తో తుడుచుకుంటూ జుట్టును ఆరబెట్టుకోవాలి.
☞ ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్-బి, జింక్ అందించే పదార్థాలు బాగా తీసుకోవాలి. పండ్లు, పచ్చి కూరగాయల సలాడ్లు రోజువారీ భోజనంలో చేర్చుకోవాలి. గుడ్లు, చేపలు, అరటిపండ్లు, పాలకూర వంటి పోషకాలున్న ఆహారం తీసుకోవాలి.
☞ మాడులో రక్త ప్రసరణ బాగా జరగాలంటే తరచూ జుట్టును దువ్వుతూ ఉండాలి. దానివల్ల మాడులో నూనెలు ఉత్పత్తి అవుతాయి. చుండ్రు తగ్గుతుంది.
👉 – Please join our whatsapp channel here –