మలేషియా ఆంధ్ర అసోసియేషన్ (MAA) ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి, మలేషియా కౌలాలంపూర్ లో తానియా గ్రాండ్ రూఫ్ టాప్ హాల్, TLK కాంప్లెక్స్, బ్రిక్ ఫీల్డ్స్, కౌలాలంపూర్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో తెలుగు వారితోపాటు ప్రవాస భారతీయులు పాల్గొన్నారు.
ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ఇండియన్ హై కమిషనర్ కౌన్సిలర్ మేడం అమ్రితా దాస్ గారు మరియు మలేషియా తెలుగు ఫౌండేషన్ ప్రెసిడెంట్ దాతో కాంతారావు గారు, మలేషియా తెలంగాణ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ బూరెడ్డి మోహన్ రెడ్డి గారు, తెలుగు ఎక్స్ పాట్స్ అసోసియేషన్ ఆఫ్ మలేషియా ఆనంద్ గారు, ఇతర సంఘాల ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సంక్రాంతి పురస్కరించుకొని చిన్నారులతో పలు రకాల వేషాలు వేయించారు. పలువురు చిన్నారులు ఒక చేతిలో చిడతలు, మరో చేతిలో తంబురా, నుదుటన మూడు నామాలు, తలపై అక్షయ పాత్ర పెట్టుకుని హరిదాసు మరియు అమ్మవారి తదితర వేషాలు వేసుకొని చిన్నారులు వచ్చారు. చిన్నారులు ముద్దుగులుపే విధంగా వేషాలు వేసుకోవడంతో అక్కడికి వచ్చిన ప్రవాసులు హర్షం వ్యక్తం చేశారు. సంస్కృతి సంప్రదాయాలకు ప్రత్యేకమైన సంక్రాంతి సందడి మలేషియా లో కనిపించింది. కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల పాటలు హరిదాసు కీర్తనలు నృత్యాలతో ఆడిటోరియం కళకళలాడింది అలాగే ముగ్గుల పోటీల విజేతలు మరియు వివిధ వేషధారణలో వచ్చిన పిల్లలకు బహుమతులు అందజేశారు. పిల్లలు చేసిన కూచిపూడి, భరతనాట్యం నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రుచికరమైన మన తెలుగు వంటలు ఆహుతులను ఆకట్టుకున్నాయి . అలాగే ముగ్గుల పోటీలు, లక్కీ కపుల్, క్యూట్ బేబీ కాంటెస్ట్ , లక్కీ డ్రా నిర్వహించి టీవీ, బంగారు బహుమతులు అందజేశారు.
ఇండియన్ హై కమిషనర్ కౌన్సిలర్ మేడం అమ్రితా దాస్ గారు మాట్లాడుతూ పిల్లలకు సంప్రదాయాల పట్ల అవగాహన కలిగించడానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని అలాగే ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ నిర్వహిస్తున్న మలేషియా ఆంధ్ర అసోసియేషన్ వారిని ఆమె అభినందించారు. ఈ సంక్రాంతి తెచ్చే సంబరాలు ప్రతి ఇంట ఆనందం వెల్లి విరియాలని ఆమె ఆకాంక్షించారు.
మా ప్రెసిడెంట్ శ్రీరామ్ మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ విశిష్టతను వివరించారు.అలాగే ఈ సంవత్సరం అందరు సుఖ సంతోషాలతో గడపాలని ముక్యంగా రైతుల ఇంట సిరులు పండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి స్పాన్సర్ గా వచ్చిన భువనేశ్వరి గ్రూప్ రియల్ ఎస్టేట్ సంస్థ, లేర్నేర్ సర్కిల్, వికాస్ ఇంటర్నేషనల్ స్కూల్ , ఐడియా లాజిక్ , ఆక్సీ డేటా , రెడ్ వేవ్, లులు మనీ , కానోపుస్, వేల్యూ బజార్ , హిడెన్ బ్రెయిన్ ,జాస్ ,టెక్ తీరా ,స్పైసి హబ్ రెస్టారెంట్, శ్రీ బిర్యానీ ,మై 81, వైట్ ఫిన్స్ మై 81,దేశి తడ్క రెస్టారెంట్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంక్రాంతి సంబరాలను విజయవంతం కావడానికి సహకరించిన మా కోర్ కమిటీ ని వాలంటీర్ గా ముందుకు వచ్చిన సభ్యులు, మరియు మా సభ్యులను అయన అభినందించారు.
ఈ కార్యక్రమములో ప్రెసిడెంట్ శ్రీరామ్ కోర్ కమిటీ సభ్యులు వెంకట్,శ్రీనివాస్ చౌటుపల్లి, ,జగదీష్ శ్రీరామ్ ,కిరణ్ గుత్తుల ,రవి వంశి ,శారద ,దీప్తి ,హరీష్ నడపన ,కిషోర్ ,నాయుడు రావూరి ,రవి జాస్ ,సందీప్ తన్నీరు ,సతీష్ నంగేడా ,కల్పనా వీ ,కల్పనా ఎస్ , ప్రమీల , వెంకీ , రంగా నడపన ,మురళి కృష్ణ , కుమార్ జి తదితరులు పాల్గొన్నారు
👉 – Please join our whatsapp channel here –