ScienceAndTech

‘హర్‌హర్‌ మౌసం.. హర్‌ఘర్‌ మౌసం’’ పేరిట కొత్త యాప్‌

‘హర్‌హర్‌ మౌసం.. హర్‌ఘర్‌ మౌసం’’ పేరిట కొత్త యాప్‌

zz భారత వాతావరణ శాఖ (ఐఎండీ) 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోని వారందరికీ వాతావరణ సమాచారం అందించేందుకు ‘‘హర్‌హర్‌ మౌసం.. హర్‌ఘర్‌ మౌసం’’ (ప్రతి ఒక్కరికీ.. ప్రతి ఇంటికీ వాతావరణ సమాచారం) పేరిట కొత్త యాప్‌ను రూపొందించింది. దీన్ని ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ సోమవారం దిల్లీలో విడుదల చేశారు. హైదరాబాద్‌ వాతావరణ కేంద్రంలోనూ ఈ యాప్‌ని ఉన్నతాధికారులు విడుదల చేశారు. ఈ యాప్‌ సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. దీని ద్వారా ప్రతి రోజు.. తర్వాత వచ్చే అయిదు రోజులకు సంబంధించిన వాతావరణ వివరాలు తెలుసుకోచ్చు. ఆంగ్లం, హిందీ, తెలుగుతో పాటు మరో 11 ప్రాంతీయ భాషల్లో సమాచారం అందుతుంది. తుపాన్లు, భారీ వర్షాలకు సంబంధించిన సమాచారం ముందుగానే తెలియడం వల్ల విత్తనాలు, నీటిపారుదల, ఎరువులు, పురుగుమందుల వినియోగం వంటి వ్యవసాయ కార్యకలాపాలకు ప్రణాళిక రూపొందించుకోవడం సులువవుతుందని ఐఎండీ అధికారులు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z