DailyDose

రెండేళ్లలో 2.29 కోట్లు దోపిడీ

రెండేళ్లలో 2.29 కోట్లు దోపిడీ

డిజిటల్ మార్కెట్‌‌‌‌ను సైబర్ నేరగాళ్లు టార్గెట్‌‌‌‌గా చేసుకున్నారు. ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ అడ్డాగా అందినంతా దోచేస్తున్నారు. ఇందుకు ప్రముఖ ఈ– కామర్స్‌‌‌‌ సంస్థల పేర్లతో నకిలీ కస్టమర్ కేర్ సెంటర్లు ఓపెన్ చేస్తున్నారు. ఢిల్లీ, గుర్‌‌‌‌‌‌‌‌గావ్‌‌‌‌, కోల్‌‌‌‌కతా కేంద్రంగా దేశవ్యాప్తంగా మోసాలకు పాల్పడుతున్నారు. ఈ–కామర్స్ సైట్ల ఫేక్ టోల్‌‌‌‌ఫ్రీ నంబర్లు, కస్టమర్ సపోర్ట్ నంబర్లు వెతికే వారిని లక్ష్యంగా చేసుకుంటున్నారు. రెండేళ్ల వ్యవధిలో హైదరాబాద్‌‌‌‌ సిటీలో 506 కేసుల నమోదు కాగా, రూ.2.29 కోట్లు సైబర్ నేరగాళ్ల అకౌంట్స్‌‌‌‌లోకి వెళ్లాయి. ప్రతి ఏటా ఫేక్ టోల్‌‌‌‌ ఫ్రీ నంబర్ల సంఖ్య భారీగా పెరిగిపోతున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు.

ఫుడ్‌‌‌‌ డెలివరీ,ఈ-కామర్స్ సైట్లే టార్గెట్‌‌‌‌

ప్రధానంగా ఫుడ్ డెలివరీ యాప్స్‌‌‌‌లో కస్టమర్ సర్వీసెస్ పేరుతో ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఆన్‌‌‌‌లైన్ సైట్లలో నకిలీ టోల్ ఫ్రీ నంబర్లు క్రియేట్ చేస్తున్నారు. పేరు పొందిన ఈ– కామర్స్ వెబ్‌‌‌‌పేజ్‌‌‌‌కి ఏ మాత్రం తేడా లేకుండా ఫేక్ వెబ్‌‌‌‌పేజ్‌‌‌‌లను తయారు చేస్తున్నారు. ఆన్ లైన్ యాప్స్‌‌‌‌లో కనిపించే జోమాటో, స్విగ్గి ఒరిజినల్ వెబ్ పేజ్ తరహాలో కనిపించే సైట్స్ లో తమ టోల్ ఫ్రీ నంబర్లు పోస్ట్ చేస్తున్నారు. బాధితుల నుంచి వచ్చే రిటర్న్ ఆర్డర్లకు మనీ రీఫండ్ చేస్తామని బ్యాంక్ డీటెయిల్స్ సేకరించి క్యూ ఆర్ కోడ్, ఓటీపీ నంబర్లతో మోసాలకు పాల్పడుతున్నారు. ప్రతి ఏటా నమోదయ్యే సైబర్ కేసుల్లో హైదరాబాద్‌‌‌‌కు చెందిన సిటిజన్లే ఎక్కువ సంఖ్యలో బాధితులుగా ఉంటున్నారు.

45 శాతం మందే కంప్లయింట్లు

ఆన్​లైన్ అడ్డాగా.. కస్టమర్ కేర్ ఈ- కామర్స్‌‌‌‌ సైట్స్ లో దోచేస్తున్నారు..!ఆన్ లైన్ షాపింగ్‌‌‌‌లో కనీస సేఫ్టీ ప్రికాషన్స్ పాటించకుండా డిజిటల్ పేమెంట్స్‌‌‌‌లో డబ్బులు కోల్పోతున్నారు. సైబర్ ఫ్రాడ్స్ ట్రాప్‌‌‌‌లో పడి డబ్బు పోగొట్టుకుంటున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇందులో కేవలం 45 శాతం మంది మాత్రమే ఫిర్యాదులు చేస్తున్నట్లు గుర్తించారు. ఇందుకు కారణం రూ.5 వేల నుంచి రూ.10 వేలు కోల్పోవడంతో ఫిర్యాదులు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. అయితే.. ఆన్ లైన్ మార్కెటింగ్‌‌‌‌ మోసాలు పూర్తిగా పోలీసులకు చేరడం లేదు.

ఈ కామర్స్ వెబ్‌‌‌‌సైట్లలో సెక్యూరిటీ ఫీచర్స్ వాడడంతో పాటు టోల్‌‌‌‌ ఫ్రీ నంబర్లు, ఫేక్ కస్టమర్ కేర్ నంబర్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇలాంటి నేరాల బారిన పడకుండా ఉండాలంటే వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ అకౌంట్‌‌‌‌, ఓటీపీ వివరాలను ఇతరులకు షేర్ చేయొద్దని హెచ్చరిస్తున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z