Devotional

అధికారులుతో వాదోపవాదాలకు దూరంగా ఉండాలి-దినఫలాలు-జనవరి 22 2024

అధికారులుతో వాదోపవాదాలకు దూరంగా ఉండాలి-దినఫలాలు-జనవరి 21 2024

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1)
వృత్తి ఉద్యోగాలలో అధికారులుతో వాదోపవాదాలు దూరంగా ఉండాలి. ముఖ్యమైన పనులలో శ్రమకు తగిన ఫలితం కనపడదు. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త పడాలి. దైవదర్శనం చేసుకుంటారు. సోదరులతో వివాదాలు రాగలవు.ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థికంగా ఇబ్బందులు రుణాలు చేయవలసి రావచ్చు. వ్యాపార విషయంలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయకూడదు.

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2)
ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. చేపట్టిన పనులు వ్యయ ప్రయాసలుతో పూర్తి కాగలవు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. ఇంటా బయట ప్రతికూల వాతావరణం. వ్యవహారాలలో సలహాలు తీసుకొని వ్యవహరించడం మంచిది. విద్యార్థులు వారి కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు.

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3)
ఉద్యోగాలలో అధికారులు తో వాదోపవాదాలు దూరంగా ఉండాలి. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడును. పని ఒత్తిడి పెరుగుతుంది . ఇంటాబయట సమస్యలు అధికమవుతాయి. వృత్తి వ్యాపారాలలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. మానసిక చికాకులు. ప్రయాణాల యందు ఇబ్బందులు ఎదురవుతాయి. చేయు పనులలో కోపం అధికంగా ఉండును.అపవాదములు రాగలవు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4)
సంతానానికి సంబంధిత విషయాలు చికాకు పరుస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడును. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. మానసిక చికాకులు పెరుగుతాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది.వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం దక్కడం కష్టకరముగా ఉంటుంది.

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1)
వ్యాపారాల అభివృద్ధికి అవరోధాలు తొలగును. నిరుద్యోగులకు శుభవార్తలు వింటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో ఆగిన జీతభత్యాలు చేతికి అందుతాయి . చిన్ననాటి మిత్రులతో విందువినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి విషయంలో అనుకూలంగా ఉంటుంది.గృహమున దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2)
వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమౌతుంది. ఇతరులతో తొందరపాటు మాటలు మంచిది కాదు. శారీరక బాధలు పెరుగును. అధికారుల వలన భయాందోళనగాఉంటుంది. తలపెట్టిన పనులు పూర్తిగాక ఇబ్బందులు ఎదురవుతాయి వృధా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.ఆర్థిక వ్యవహారాలు గందరగోళంగా ఉంటాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు.

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3)
వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారస్తులు వ్యాపారాన్ని విస్తరించే ఆలోచనలు కలిసి వస్తాయి. సమాజంలో పెద్దవారి సహకారాలు అందుతాయి. ప్రశంసలతో పాటు గౌరవ మర్యాదలు పొందుతారు. వ్యక్తిగత జీవితాన్ని ఆనందంగా గడుపుతారు. గృహోపకరణ వస్తువులను కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభ సాటిగా జరుగును. ఉద్యోగాల్లో సహోద్యోగులు సహాయ సహకారాలు లభిస్తాయి.

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4)
సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. సంతాన విషయంలో శుభవార్త వింటారు. కొత్త ఆలోచనలు కలసి వస్తాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలకు అనుకూలం. మొండి బాకీలు వసూలు అవును. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఆర్థిక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఆస్తి వివాదాలు తీరి అనుకూలమైన లాభాలు పొందుతారు.

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1)
నూతన కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు.ఆర్థికాభివృద్ధి బాగుంటుంది.ఋణాలు తీర్చగలుగుతారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక సంబంధమైన లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి.. ఏ పని తలపెట్టిన అవలీలగా పూర్తి చేస్తారు. అధికార వర్గం తో సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగును. గత కొద్ది కాలంగా ఆగిపోయిన పనులు పూర్తి కాగలవు.

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2)
వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందగలరు.నూతన పరిచయాలు ఏర్పడగలవు. దూరం ప్రాంతము నుండి శుభవార్తలు వింటారు. తలపెట్టిన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి.ఆర్థిక వ్యవహారాలు సంతృప్తి కరంగా ఉంటాయి.

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3)
తలపెట్టిన పనులలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందజేస్తారు .వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు ఉంటాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. అప్రయత్నంగా అవకాశములు పొందగలరు. వ్యవహారాలలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. బంధుమిత్రుల యొక్క కలయిక.ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. సమయానకూలంగా నిర్ణయాలు తీసుకోవాలి.

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4)
సంఘంలో ప్రముఖుల ఆదరణ పొందగలరు.మొండి బాకీలు వసూలవుతాయి. బంధుమిత్రుల కలియక ఆనందం కలిగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. తలపెట్టిన పనులు పూర్తిగాక ఇబ్బందులు ఎదురవుతాయి.వృత్తి ఉద్యోగాలు అనుకూల వాతావరణం.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z