Fashion

FOMO కవల సోదరుడు JOMO తెలుసా?

FOMO కవల సోదరుడు JOMO తెలుసా?

రోజురోజుకూ సాంకేతికత అభివృద్ధి చెందుతోంది. అది పెరుగుతూనే మనల్ని, మన సమయాన్నీ లాగేసుకుంటోంది. ఫోన్‌ చూడకపోయినా.. సోషల్‌మీడియాలో కామెంట్లు, లైకులూ రాకపోయినా తెగ ఫీలైపోయేలా చేస్తోంది. ఫోన్‌కు దూరంగా ఉండాల్సివస్తే ఏదో కోల్పోతున్నామన్న భయాన్ని క్రియేట్‌ చేసింది. ఈ పోకడనే ఫియర్‌ ఆఫ్‌ మిస్సింగ్‌ ఔట్‌.. ఫోమోగా (FOMO) వ్యవహరిస్తుంటారు. దీని గురించి చాలా మందికి తెలిసిందే. కొత్తగా ఫోమోకు రివర్స్‌ ట్రెండ్‌ మొదలైంది. ఈ సోషల్‌ ప్రపంచంలో పడి ఏదో మిస్‌ అయిపోతున్నామన్న భావన పెరుగుతోంది. దీన్నే జాయ్‌ ఆఫ్‌ మిస్సింగ్‌ ఔట్‌.. జోమోగా (JOMO) పిలుస్తున్నారు. సోషల్‌మీడియా ఫీడ్‌లు, హ్యాష్‌ట్యాగ్‌లు, ఇన్‌స్టారీల్స్‌.. అంటూ ఎంతసేపూ సోషల్‌మీడియాకు బానిసైపోయి చిన్న చిన్న ఆనందాలకు, మానవ సంబంధాలకు దూరం అయిపోతున్నామన్న భావనే ఈ జోమో. ప్రస్తుతం ఈ హ్యాష్‌ట్యాగ్‌ విపరీతంగా ట్రెండ్‌ అవుతోంది. టిక్‌టాక్‌లో #JOMOకు ఏకంగా 53 మిలియన్‌ వ్యూస్‌ వచ్చాయని ఫోర్బ్స్‌ చెబుతోంది. వాస్తవానికి జోమో అనేది కొత్త పదమేమీ కాదు. 2012లోనే అమెరికాకు చెందిన అనిల్‌ డాష్‌ అనే ఔత్సాహిక పారిశ్రామికవేత్త దీన్ని కనుగొన్నాడు. తన కొడుకు పుట్టిన నెల రోజులకు తాను ఏం కోల్పోయింది తెలుసుకున్నాడు. ఈ క్రమంలో జోమో అనే పదాన్ని వినియోగించాడు. అప్పటి నుంచే జోమో వాడుకలో ఉంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z