NRI-NRT

లండన్: తాల్ సంక్రాంతి సంబరాలు 2024

లండన్: తాల్ సంక్రాంతి సంబరాలు 2024

తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్(TAL) ఆధ్వర్యంలో శనివారం నాడు ఈస్ట్ లండన్‌ లో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. లండన్ మరియు పరిసర ప్రాంతాల నుండి ప్రవాసులు పెద్దసంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బొమ్మల కొలువు, భోగి పళ్లు, ముగ్గుల పోటీలు, వంటల పోటీలు, గాలిపటాల తయారీ వంటి పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. రెడ్బ్రిడ్జ్ కౌన్సిల్ మేయర్ జ్యోత్స్నా ఇస్లాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. TAL నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను ప్రశంసించారు.



TAL ఛైర్మన్ రవి సబ్బా అతిథులకు శుభాకాంక్షలు తెలిపారు. సంస్థ కోసం కృషి చేస్తున్న వారికి ధన్యవాదాతెలు తెలిపారు. TAL కల్చరల్ సెంటర్ (TCC) అందిస్తున్న విభిన్న శిక్షణ తరగతుల గురించి ట్రస్టీ అశోక్ మాడిశెట్టి వివరించారు. కల్చరల్ ట్రస్టీ శ్రీదేవి ఆలెద్దుల, వాజిద్ బాషా, మురళీ కోట, ట్రస్టీలు అనిల్ అనంతుల, రవి కుమార్ రెడ్డి మోచెర్ల, వెంకట్ నీల, అశోక్ మాడిశెట్టి, రాయ్ బొప్పన, ఆర్ జె రత్న తదితరులు వేడుక విజయవంతానికి తోడ్పడ్డారు.





👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z